‘అఖండ 2’ ట్రైలర్.. బాలయ్య విశ్వరూపం.. దుష్ట శక్తులపై సర్జికల్ స్ట్రైక్స్

Telugu BOX Office

నందమూరి బాలకృష్ణ  కథానాయకుడిగా… బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అఖండ 2: తాండవం’. సంయుక్తా మేనన్‌ కథానాయిక. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటించారు. ఎం.తేజస్విని నందమూరి సమర్పణలో… 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లాలోని చింతామణిలో శుక్రవారం రాత్రి ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుక జరిగింది. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ని విడుదల చేశారు. శక్తిమంతమైన పాత్రలు, యాక్షన్‌ ఘట్టాలతోపాటు, కట్టిపడేసే విజువల్స్‌తో ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. ఒకరకంగా చెప్పాలంటే బాలయ్య ఇందులో విశ్వరూపం చూపించారు. ఆయన డైలాగ్స్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి.

Share This Article
Leave a Comment