నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీగా నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా విడుదలకు ముందే డిజిటల్ వేదికలపై సరికొత్త రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ సాంగ్ ‘ఆయా షేర్’ (Aaya Sher) యూట్యూబ్‌లో ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ మార్కును దాటి కొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న మాస్ చార్ట్‌బస్టర్లలో ఒకటిగా నిలిచి, సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.
సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన ఉర్రూతలూగించే మాస్ బీట్స్ ఈ పాటకు ప్రాణం పోసాయి. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన పవర్‌ఫుల్ లిరిక్స్, అద్దుల జంగిరెడ్డి మరియు అర్జున్ చాందీల వినూత్న గాత్రం శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్యాచీ ట్యూన్, అదిరిపోయే కొరియోగ్రఫీ, కంటికి విందుగా ఉండే విజువల్స్‌తో ఈ పాట గ్రామీణ ప్రాంతాల నుంచి సోషల్ మీడియా రీల్స్ వరకు ప్రతిచోటా మారుమోగుతూ ఒక సెలబ్రేషన్ సాంగ్‌గా మారింది.
‘దసరా’ కాంబో రిపీట్
‘దసరా’ వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’ పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నానిని మునుపెన్నడూ చూడని రగ్గడ్, పవర్‌ఫుల్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. నాని ఫియర్స్ బాడీ లాంగ్వేజ్, కొత్త మేకోవర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ సింగిల్‌తోనే రికార్డులు బద్దలవుతుండటంతో 2026లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ మొదటి వరుసలో నిలిచింది. ఈ పాట సృష్టించిన సంచలనంతో ఆల్బమ్ నుంచి రాబోయే తదుపరి అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
