Kalki 2898 AD: కల్కి అడ్వాన్స్ బుకింగ్.. మొదటి రోజు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయంటే..

Telugu BOX Office

ప్రభాస్, దీపికా పదుకొనే నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ‘కల్కి 2898 AD’ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇండియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఆదివారం మొదలైంది. మరి ఈ సినిమా తొలిరోజు ఎంత వసూళ్లు చేసిందో తెలుసుకుందాం.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం. ఇందులో చాలా మంది స్టార్స్ నటించారు. దీపికా పదుకొణె, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దిశా పటానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయగా.. దానికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కల్కి 2898 ఏడీ’ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా 2డీ, 3డీ, ఐమాక్స్ 3డీ ఫార్మాట్లలో విడుదల కానుంది. టైమ్స్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఈ చిత్రం కోసం 26 IMAX స్క్రీన్‌లు బుక్ చేశారు.


సాక్‌నిల్క్ రిపోర్ట్ ప్రకారం.. ‘కల్కి 2898 ఏడీ ‘ మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. తొలిరోజు ఈ చిత్రం 2,17,044 టిక్కెట్లు 3306 షోలకు అమ్ముడయ్యాయి. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో రూ.6.49 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సనిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ ధరలను పెంచింది. ఈ చిత్రం విడుదలైన మొదటి 8 రోజులకు పెరిగిన ధరలతో ప్రదర్శించబడుతుంది. దీంతో ఈ మూవీ గత రికార్డులను కచ్చితంగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Share This Article
Leave a comment