తెలుగు హీరో స్థాయి నుంచి పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాలీవుడ్‌లోనూ అక్కడి హీరోల కంటే ఎక్కువగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం. ఇక ప్రభాస్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామరస్ డ్రెస్సులతో ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఇప్పుడు మరోసారి తన స్టైలిష్ లుక్ తో ఆకర్షిస్తున్నాడు.
ప్రస్తుతం డార్లింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు. హీరోయిన్ దిశా పటానీతో ఇప్పటికే ఓ రొమాంటిక్ పాటను ఇటలీలో షూట్ చేశారు. ఇటలీలో కల్కి సెట్స్‌ను, ప్రభాస్, దిశా పటానీ ఫోటోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో బర్బెర్రీ జాకెట్ ధరించిన ప్రభాస్ భలే ఆకట్టుకుంటున్నాడు. ప్రభాస్ ధరించిన జాకెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.. ఆ బ్లాక్ కోటు ధర దాదాపు రూ.76 వేల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.. ఈ వార్త వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఎంతైనా తమ హీరో రేంజ్ అలాంటిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నట దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది మే 9న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.