పెళ్లి పీటలెక్కనున్న త్రిష.. వరుడు అతడేనట

Telugu BOX Office

చెన్నై చంద్రం త్రిష పెళ్లి చేసుకోబోతుందా… అవును ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇదే టాక్ వినిపిస్తుంది. 40 ఏళ్ల వయసొచ్చినా సరే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఓ ప్రముఖ నిర్మాతతో త్వరలో ఏడడుగులు వేయనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది.

త్రిష గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ‘వర్షం’ మూవీతో బంపర్ హిట్ కొట్టిన ఈ చెన్నై కోలీవుడ్, టాలీవుడ్‌లో సుమారు పదేళ్లు అగ్ర హీరోయిన్‌గా చక్రం తిప్పింది. అయితే ఆమెకి తగ్గ సినిమాలు పడకపోయేసరికి ఛాన్సులు తగ్గిపోయాయి. ఇలాంటి టైంలో ’96’ మూవీ త్రిష కెరీర్‌నే టర్న్ చేసింది.

తమిళంలో వచ్చిన ఈ ప్రేమ కథాచిత్రం హీరోయిన్‌గా త్రిషకు మళ్లీ లైఫ్ ఇచ్చింది. దీని తర్వాత పొన్నియిన్ సెల్వన్, లియో లాంటి పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం మలయాళంలో రెండు, తమిళంలో మూడు మూవీస్ చేస్తున్న త్రిష ఇప్పుడు పెళ్లిపై మనసు పారేసుకుందట. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుందట.

ఓ మలయాళ నిర్మాతతో త్రిష త్వరలో ఏడడుగులు వేయనుందట. ప్రస్తుతం ఈ విషయం బయటకు చెప్పనప్పటికీ.. త్వరలో దీని గురించి అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట. 2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు విబేధాలు రావడంతో పెళ్లి చేసుకోలేదు. మరి ఇప్పుడు పెళ్లి అనే వస్తున్న రూమర్స్ నిజమా కాదా తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Share This Article
Leave a comment