తనకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టమని అలాంటి ప్రాజెక్టుల్లో పాత్రలు పోషించడం చాలా ఆసక్తిగా ఉంటుందని అంటోంది సమంత. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’తో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసిన సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. తన తదుపరి ప్రాజెక్టులపై అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
నిన్ను పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో ఎప్పుడు చూడగలమని.. ఓ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు… ‘ఎందుకో తెలియదు కానీ నాకు యాక్షన్ సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. అలాంటి చిత్రాలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. త్వరలో మీ ముందుకు రానున్న ‘సిటాడెల్’ సిరీస్‌లో యాక్షన్‌తో అలరించనున్నా అని చెప్పుకొచ్చింది. ఎంత కష్టంగా ఉన్న నేను దాన్ని ఇష్టపడి చేశానని… సవాళ్లను ఎదుర్కొవడాన్ని ఇష్టపడతానని సామ్ వెల్లడించింది. ఆ సిరీస్‌లో తాను చేసిన ఆ యాక్షన్ సన్నివేశాలను మీరందరూ చూడాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చింది.
రాజ్, డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జోడీగా కనిపించనుంది సమంత. తిమేరీ ఎన్. మురారి రచించిన ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా వస్తున్న ఇంగ్లిష్ రొమాంటిక్-కామెడీ ‘చెన్నై స్టోరీ’తో అలరించేందుకూ సిద్ధమవుతోంది సమంత.