సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “టిక్ టిక్ టిక్”

సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టిన “టిక్ టిక్ టిక్”

జయంరవి కథానాయకుడిగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియాస్ ఫస్ట్ స్పేస్ థ్రిల్లర్ “టిక్ టిక్ టిక్”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చదలవాడ పద్మావతి నిర్మాణ సారథ్యంలో తెలుగులో అనువాదరూపంలో విడుదల చేసారు. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు విశేషమైన రీతిలో ఆదరించారు. తమిళనాట జయంరవి కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన “టిక్ టిక్ టిక్” తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చదలవాడ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేసారు. పెద్దలతోపాటు పిల్లలు కూడా మా చిత్రాన్ని ఆదరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. మేం ఉహించినదానికంటే భారీ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయి. ఇదే తరహాలో వైవిధ్యమైన చిత్రాలు మా సంస్థ నుంచి వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే చూడాలని కోరుకొంటున్నాము.