ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా కొనసాగుతోంది. భోగి పండగ రోజున ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మహాశివరాత్రి రోజున ముగియనుంది. త్రివేణి సంగమంలో దేశవిదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానం చేయడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు 40 కోట్ల మందికిపైగా ఈ మహా కుంభమేళాకు వస్తారని అంచనా వేసిన అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకుల కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణీకుల కోసం ఎప్పటికప్పుడు స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోన్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్టు అతి తక్కువ ఖర్చుతో ప్రత్యేక టూర్స్ ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలోనే మహా కుంభమేళా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మహా కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం దానాపూర్ ఎక్స్ప్రెస్ జర్నీతో సరి కొత్త ప్యాకేజీని ప్రకటించింది.
మొత్తం 6 రోజులపాటు అంటే 5 రాత్రులు, 6 పగళ్ల పాటు ఈ ప్యాకేజీ ఉంటుంది. 3 రోజుల పాటు ఉదయం టిఫిన్, రాత్రిపూట భోజనం ఉంటుంది. అంతేకాకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తారు. ఈ ట్రైన్ జర్నీ హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమంత్రి, ఏలురు, తుని, దువ్వాడ, విజయనగరం రైల్వే స్టేషన్లలో మహా కుంభమేళకు వెళ్లాలనుకునే భక్తులు ఈ ట్రైన్ ఎక్కొచ్చు. ఈ టూర్లో భాగంగా భక్తులు వారణాసి కూడా కవర్ చేస్తారు. ఈ నెల 17, 19, 24 తేదీల్లో అదేవిధంగా వచ్చే నెల ఫిబ్రవరిలో 2, 7, 14, 16, 21 తేదీల్లో ఈ ఆధ్యాత్మిక యాత్ర టూర్ ప్రారంభం కానుంది.
టికెట్ ధరలు ఇలా ఉన్నాయి
ఈ టూర్ పూర్తి వివరాల కోసం IRCTC అఫీషియల్ వెబ్సైట్ www.irctc.co.in విజిట్ చేయండి.