భాషలకు అతీతంగా సౌత్‌లో కోట్లాది మంది అభిమానుల ఆదరణ సొంతం చేసుకున్న హీరోల్లో సూర్య ఒకరు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులతో ఆయనకున్న అనుబంధం అత్యంత ప్రత్యేకమైనది. ఆయన గతంలో నటించిన అనేక సినిమాలు తెలుగునాట బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను నమోదు చేశాయి. ఈ క్రమంలోనే ఆయన ఇటీవల నటించిన ‘వీరభద్రుడు’ చిత్రం కూడా ఆకట్టుకునే విజయాన్ని సాధించి ఆయన మార్కెట్ స్థాయిని మరోసారి చాటిచెప్పింది. ఇప్పుడు అదే క్రేజ్‌కు టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే విలువల బ్రాండింగ్, ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకీ అట్లూరి మార్క్ ఎంటర్టైన్మెంట్ జతకట్టడంతో సూర్య కొత్త చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చుట్టూ భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రకటన నాటి నుంచే ట్రేడ్ వర్గాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించగా, దానికి తగ్గట్టుగానే వ్యాపారపరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ కుటుంబ కథా చిత్రంలో సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టనున్న ఈ సినిమా కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ప్రమోషనల్ కంటెంట్, పాటలు సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ బజ్ కారణంగా విడుదల కాకముందే వ్యాపార పరంగా సినిమా భారీ సంచలనాన్ని నమోదు చేసింది.
రూ. 215 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్
ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నిర్మాణానికి దాదాపు ₹130 కోట్ల బడ్జెట్ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ చిత్రం సాధించిన వ్యాపార లెక్కలు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో థియేట్రికల్ హక్కుల రూపంలో దాదాపు రూ.90 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక అసలైన విశేషం నాన్-థియేట్రికల్ హక్కుల్లో చోటుచేసుకుంది. శాటిలైట్, డిజిటల్, ఆడియో రైట్స్ అన్నీ కలిపి మొత్తంగా ₹125 కోట్ల మేర సొమ్మును రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నాన్-థియేట్రికల్ బిజినెస్ వివరాలను పరిశీలిస్తే:
- డిజిటల్ హక్కులు: డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.85 కోట్ల భారీ మొత్తంతో చేజిక్కించుకుందని వినికిడి.
- శాటిలైట్ హక్కులు: అన్ని భాషల శాటిలైట్ హక్కులు కలిపి దాదాపు ₹28 కోట్లకు అమ్ముడయ్యాయి.
- ఆడియో హక్కులు: మ్యూజిక్ రైట్స్ రూపంలో ఈ చిత్రానికి ₹12 కోట్లు వచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ విధంగా థియేట్రికల్ హక్కుల రూ. 90 కోట్లు, నాన్-థియేట్రికల్ రూపంలో వచ్చిన రూ. 125 కోట్లు రెండూ కలిపి మొత్తంగా ₹215 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు కావడం విశేషం.
రిలీజ్‌కు ముందే కోట్ల టేబుల్ ప్రాఫిట్
ప్రస్తుత సినిమా మార్కెట్ పరిస్థితుల్లో డిజిటల్ హక్కుల అమ్మకాలు, బాక్సాఫీస్ ఒప్పందాలు చాలా సవాలుగా మారాయి. ఎంతటి భారీ చిత్రాలకైనా ఓటీటీ డీల్స్ అనుకున్న స్థాయి రేట్లకు ముగియడం అంత సులువుగా జరగడం లేదు. అలాంటి సంక్లిష్ట సమయంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ డిజిటల్ డీల్ దాదాపు ₹80 కోట్లకు పైగా ముగిసిందంటే సూర్య క్రేజ్, వెంకీ అట్లూరి కథా బలం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రూ. 130 కోట్ల మేర పెట్టుబడి పెట్టిన నిర్మాత సూర్యదేవర నాగవంశీకి, సినిమా థియేటర్లలో విడుదల కాకుండానే దాదాపు రూ.25 – 30 కోట్ల వరకు ‘టేబుల్ ప్రాఫిట్’ లభించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలనుకునే నేటి వాతావరణంలో, బాక్సాఫీస్ వద్ద బొమ్మ పడకముందే నిర్మాతలు భారీ లాభాల తీరానికి చేరడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ రేంజ్ బాక్సాఫీస్ బిజినెస్ ల్యాండ్‌మార్క్ రీచ్ అయిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేటర్లలో ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.
