ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. గతేడాది అక్టోబరు 19న సీఎం చంద్రబాబు అమరావతి పునర్నిర్మాణ పనులను అక్కడి నుంచే మొదలుపెట్టారు. దీన్ని తొలుత ఆగస్టు 15 నాటికి ప్రారంభించాలని భావించినప్పటికీ అనుకోకుండా వెనక్కి వెళ్లింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్లో పడ్డాయి. వీలైనంత త్వరగా వాటిని పూర్తి పూర్తి చేయాలని భావిస్తుండగా అందుకు సంబంధించి పనులు జోరందుకున్నాయి. రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఈ భవనం నిర్మాణం జరుగుతోంది. ఈ భవనాన్ని దాదాపు మూడున్నర ఎకరాల్లో మొత్తం ఏడు అంతస్తులతో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండనుంది. అందులో అమరావతి సిటీతోపాటు ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్యం, వరదలు వంటి అంశాలపై రివ్యూ చేయనున్నారు. ఈ కార్యాలయ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం విజయవాడలో వున్న ఆఫీసును మెప్మాకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు అధికారులు.
ఈ భవనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. అమరావతి అంటే గ్రాఫిక్స్ అంటూ ఇన్నాళ్లూ వైసీపీ ప్రచారం చేయగా.. నెటిజన్లు ఇప్పుడు ఈ వీడియోను వైరల్ చేస్తూ వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు. ఇక అమరావతి నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు. లోపల చూస్తే చైనా భవనాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో కనిపిస్తోంది. పతీ ఫ్లోర్లో విశాలమైన గదులు, కాన్ఫరెన్సు హాలు పరిశీలించినవారు చైనాలో నిర్మించే భవనాలకు ఏ మాత్రం తగ్గదని అంటున్నారు. ఒక్క సీఆర్ఢీయే భవనం ఈ స్థాయిలో ఉంటే మార్చి నాటికి ఎమ్మెల్యేల భవనాలు ఏ విధంగా ఉంటాయోనని అంటున్నారు. వచ్చే మార్చి నాటికి ఎమ్మెల్యే గృహాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి ఇలా ఒక్కొక్క నిర్మాణాలు కొలిక్కి వస్తుండటంతో ఆ ప్రాంత వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
