పురాణాల్లో రక్షాబంధన్‌ కథలు.. రాఖీ పండగ ఎలా పుట్టిందో తెలుసా?

Telugu BOX Office

రాఖీ పండుగ గురించి  పురాణాల్లో అనేక కథలున్నాయి.  భాగవతం, మహాభారతం, భవిష్య పురాణాల్లో దీనికి సంబంధించి కొన్ని కీలకఘట్టాలున్నాయని పండితులు చెబుతున్నాయి. మహాభారత యుద్దంలో జరిగిన ఓ సంఘటన నుంచి రాఖీ పండుగ పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఆ తరువాత దేవుళ్లు కూడా రక్షాబంధనాన్ని జరుపుకున్నారని పండితులు చెబుతున్నారు.  వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించాల్సిన సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తారు. అప్పుడు కృష్ణుడి చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన వెంటనే  పాండవుల భార్య అయిన ద్రౌపది… తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలుకి రక్షగా చుడుతుంది. అప్పుడు కృష్ణుడు… నీకు ఎటువంటి సమయంలోనైనా ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో కాపాడతాను’ అని అభయమిస్తాడు. తర్వాత దుర్యోధనుడి సోదరుడు దుశ్శాసనుడు నిండుసభలో ద్రౌపది చీరను లాగి అవమానించినప్పుడు శ్రీకృష్ణుడు చీరలు అందించి ఆదుకున్నాడు. అలా ద్రౌపది గౌరవమర్యాదలను కాపాడటానికి రాఖీ కారణమైంది. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని చెబుతారు.

బలి చక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనతోపాటు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకువస్తుంది. అందుకే రక్షా బంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి.

తనకు సోదరి లేదని గణేశుడు బాధపడేవాడట. దీంతో ఈశ్వరుడు తన సంతానం సంతోషంగా ఉండటానికి సంతోషిమాతను సృష్టించాడు. సంతోషిమాత గణేశుడి మణికట్టుకు రాఖీ కట్టింది, ఇది రక్షా బంధన్ పండుగకు మూలంగా మారిందని చెబుతుంటారు.

పవిత్ర నది అయిన సోదరి యమున.. తన సోదరుడైన యముడిని చాలాకాలం తర్వాత కలిసినప్పుడు రాఖీ కట్టింది. సోదరుడి పట్ల తనకున్న ప్రేమకు చిహ్నంగా ఆమెకు ఇలా చేసింది. అందుకు సంతోషించిన యముడు ఆమెకు అమరత్వం కలిగేలా వర్గాన్ని ఇచ్చాడు. అందుకే ఎన్నో పర్యావరణ ముప్పులను ఎదుర్కొంటున్నప్పటికీ యమునా నది ప్రవహిస్తూ ఉండటానికి ఇదే కారణమని నమ్ముతారు.

రక్షా బంధన్ ప్రాముఖ్యత

రక్షా బంధన్ పండుగ సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి, వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకునే రోజు. ఈ పండుగలో, సోదరి తన సోదరుడి శ్రేయస్సు, ఆరోగ్యం మరియు ఆనందం కోసం ప్రార్థిస్తుంది, మరియు సోదరుడు తన సోదరిని అన్ని కష్టాల నుండి కాపాడతానని వాగ్దానం చేస్తాడు.  రక్షా బంధన్ పండుగను జరుపుకోవడం ద్వారా, తోబుట్టువులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ఒకరికొకరు అండగా ఉండాలని, మరియు ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలని తెలియజేస్తుంది.

Share This Article
Leave a Comment