టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అగ్ర హీరోల చిత్రాల విడుదల తేదీల సందడి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత వేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్‌లో “ఫౌజీ” (Fauzi) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ విజువల్ వండర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. అయితే ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ లాక్ అవ్వడం ఇప్పుడు నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్ర విడుదలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

బాలయ్య సినిమాకు థియేటర్ల సమస్య?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK 111’. వాస్తవానికి ఈ చిత్రాన్ని దసరా బరిలోనే దించాలని అనుకున్నా, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల డిసెంబర్ 4న విడుదల చేయాలని చిత్ర యూనిట్ అంతర్గతంగా ఒక ప్లాన్ సిద్ధం చేసుకుంది. కానీ, అంతకంటే ఒక్క రోజు ముందే అంటే డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’తో థియేటర్లలోకి వస్తుండటంతో బాలయ్య సినిమా విడుదలలో సందిగ్ధత నెలకొంది. ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా కటౌట్ బాక్సాఫీస్ బరిలో నిలిచినప్పుడు సహజంగానే థియేటర్ల కొరత తీవ్రంగా ఉంటుంది. దీనికి తోడు, పెద్ద సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలంటూ టాలీవుడ్ నిర్మాతలు ఇటీవల ఒక అంతర్గత ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ కొత్త రూల్ ప్రకారం చూసుకున్నా.. ‘ఫౌజీ’ రిలీజ్ అయిన వెంటనే బాలయ్య సినిమా రావడం దాదాపు అసాధ్యం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
వెనక్కి తగ్గనున్న NBK 111 బృందం
అయితే ఈ గందరగోళంలో ‘NBK 111’ చిత్ర బృందానికి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ఎలాంటి విడుదల తేదీని ప్రకటించలేదు. దీనివల్ల సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు వారికి మంచి అవకాశం దొరికింది. ప్రభాస్ లాంటి భారీ చిత్రంతో అనవసర పోటీ పెట్టుకోకుండా, తమ సినిమా విడుదలను మరికొన్ని రోజులు వెనక్కి జరిపి సరికొత్త డేట్‌ను వెతికే పనిలో పడ్డారు మేకర్స్. క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేస్తూ డిసెంబర్ చివరి వారంలో సినిమాను థియేటర్లలోకి తెస్తే న్యూ ఇయర్ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ బాక్సాఫీస్ వ్యూహంపై త్వరలోనే అధికారిక క్లారిటీ రానుంది.
