భారతీయులందరూ ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతిలో పండుగలకు కూడా చాలా విశిష్టత ఉంది. ప్రతి పండుగని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. చైత్ర నవరాత్రి చివరి రోజు అనగా చైత్ర శుద్ద నవమి రోజున జరుపుకునే శ్రీరామనవమిని ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీ రామ నవమి జరుపుకుంటారు. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రాముడు అవతరించినందున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఇంతటి పవిత్రమైన శ్రీరామనవమి రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
శ్రీరామనవమి రోజున చేయకూడని పనులు
భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ పవిత్రమైన పర్వదినాన పొరపాటున కూడా మాంసం మద్యం సేవించరాదు. అలాగే పండగ రోజు తయారు చేసే వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించరాదు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదు. అలాగే శ్రీరామనవమి పండుగ రోజున జుట్టు కత్తిరించుకోవడం ఆ శుభమని పండితులు చెబుతున్నారు. అందువల్ల పండుగ రోజున జుట్టు కత్తిరించకూడదు. భక్తిశ్రద్ధలతో శ్రీరాముడిని కొలిచే ఈ శ్రీరామనవమి రోజున ఇతరులను దూషించకూడదు.అబద్దాలు ఆడకూడదు.
శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులు
ఓం శ్రీ రామయ: నమ:..శ్రీ రామ జయ రామ జయ జయ రామ…ఓం దశరథ తనయాయ విద్మహే … సీతావల్లభయ ధిమాహీ తనో రామ ప్రచోదాయత్ అనే మంత్రాన్ని జపిస్తూ శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలిగి పాపాలు నశిస్తాయి. శ్రీ రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి, ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం మంచిది. అలాగే ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. వీటన్నింటిని ఏకకాలంలో నామ జపం, మంత్రాలు, శ్లోక పఠనంతో అనుసరించాలి. స్వామివారికి తలంబ్రాలు పడిన తరువాతనే మధ్యాహ్న భోజనం చేయాలి. అవకాశం చేసుకొని దగ్గరలోని దేవాలయానికి వెళ్లి శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించండి.