Hanuman Jayanthi 2024: హనుమాన్ జయంతి రోజు ఇవి అస్సలు చేయొద్దు

Telugu BOX Office

త్రేతాయుగంలో శ్రీరాముడికి.. ఆంజనేయుడికి ఉన్న సంబంధం అందరికి తెలిసిందే. హనుమంతుడు .. శ్రీరాముని పట్ల ఎంత భక్తి విశ్వాసంతో ఉన్నాడో వేరే చెప్సాల్సిన పనిలేదు. అయితే పురాణాల ప్రకారం.. శ్రీరామునికి సేవ చేసేందుకు సాక్షాత్తు పరమేశ్వరుడే … ఆంజనేయుని రూపంలో అవతరించాడని… రామాయణంలో సుందరాకాండ ద్వారా తెలుస్తుంది. అసలు ఎందుకు శివుడు హనుమంతుడిగా కోతి రూపంలో జన్మించాడు.. శ్రీరాముడికి ఎందుకు సేవకుడిగా ఉన్నాడో హనుమత్​జయంతి సందర్భంగా తెలుసుకుందాం. .

కృతయుగంలో ఎక్కడ చూసినా.. దేవుళ్లు.. దేవతలు.. యఙ్ఞాలు,.. యాగాలు చేస్తూ.. అన్ని లోకాలను కాపాడుతూ.. ధర్మ పాలన సాగించేవారు. అయితే దేవతలు చేసే పనులకు రాక్షసులు ఆటంకం కలిగించేవారు. రాక్షసులు కూడా.. దేవతలు ఇచ్చిన వరాల వల్ల చేయని అకృత్యాలు ఏమీ లేవు. ఒక్కోసారి రాక్షస చర్యల వల్ల దేవతలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. అయితే వారి పాపాలు పండిన తరువాత శ్రీ మహా విష్ణువు అలాంటి రాక్షసులను సంహరించేవారు.. ఇలా ఉండగా.. ఒకానొక సమయంలో వైకుంఠంలో ఈశ్వరుడు … విష్ణమూర్తి కలుసుకున్నారు. వారిద్దరు లోకాలు గురించి చర్చించుకుంటుండగా.. ఏవయ్యా శ్రీహరి… రాక్షసులకు చంపాల్సిన పరిస్థితి వస్తే.. నీవు ఎంతసేపు.. కల్కి అవతారమని.. మత్స్యా అవతారమంటావు.. లేకపోతే ఇంకేదో అవతారమంటావు… అంతేకాదు.. డైరక్ట్​గా వెళ్లవు.. అనేక అవతారాల్లో మారువేషంలో వెళ్లి రాక్షసులను చంపుతావు.. ఆ క్రెడిట్​ అంతా నీకే దక్కాలనా.. ఇతరులకు ఎవరికీ అవకాశం ఇవ్వవని పరమేశ్వరుడు .., విష్ణుమూర్తిని ప్రశ్నించాడని పురాణాల్లో ఉంది.

ఆ సమయంలో పరమేశ్వరుడు అడిగిన ప్రశ్నకు మహావిష్ణువు నవ్వి… సరే శివయ్యా… ఈ సారి ఎవరైనా రాక్షసుడిని చంపాల్సి వచ్చినప్పుడు .. నీవే వెళ్లి చంపు అని విష్ణుమూర్తి అన్నాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత గర్బవాసురుడు అనే రాక్షసుడు దేవ, మానవ లోకాలను హింసిస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ కలిసి.. రాక్షసులను సంహరించే శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లారు. ఆ రాక్షసుడు పెట్టే బాధలు భరించలేకపోతున్నాము.. అతని బారి నుండి రక్షించాల్సిందిగా కోరారు. రాక్షసులను సంహరిచే పనిని ఈశ్వరుడు చేస్తానన్నాడు విష్ణువు. అప్పుడు దేవతలందరూ కలిసి.. శివ నీవే ఆ రాక్షసుడిని చంపి మమ్ములను కాపాడమని ప్రార్థించారు.

అప్పుడు పరమేశ్వరుడు.. శ్రీహరితో సరదాగా మనము ఒక పందెం వేసుకుందామన్నారని పండితులు చెబుతున్నారు. అదేంటంటే.. నేను ( పరమేశ్వరుడు) కనుక ఆ రాక్షసుడిని చంపితే.. ఒక జన్మలో నీకు ( మహావిష్ణువునకు) సేవకుడిగా జన్మించాలని.. అలా చంపకపోతే నీకు ( మహావిష్ణువునకు) నేను ( పరమేశ్వరుడు) సేవకుడిగా జన్మిస్తానని బెట్టింగ్ పెట్టుకుందామన్ను.. శివుడు.. విష్ణువు… మాట ఇచ్చి పుచ్చుకున్నారని సుందరాకాండ ద్వారా తెలుస్తోంది.

అయితే ఆ రాక్షసుడు చాలా గొప్పవాడు. బ్రహ్మదేవుని వలన ఎన్నో వరాలు పొందిన రాక్షసుడు గర్భాశురుడు. ఆ రాక్షసునితో పోరాడి.. జయించలేక ఈశ్వరుడు తిరిగి వచ్చాడు. అప్పుడు మహావిష్ణువు భల్లూక అవతారంతో ఆ రాక్షసుడి వద్దకు వెళ్లి.. గర్భాశుర రాక్షసుడిని చంపి వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు శివుడు.. విష్ణువు ఇచ్చి పుచ్చుకున్న మాట ప్రకారం.. త్రేతా యుగంలో రామునిగా అవతరించిన విష్ణువునకు.. శివుడు .. ఆంజనేయునిగా పుట్టి సేవకుడు అయ్యాడని పండితులు చెబుతున్నారు.

హనుమంతుని జననం

చైత్ర మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున అంజనీ దేవి కుమారుడిగా ఆంజనేయుడు జన్మించాడని నమ్ముతారు. అందుకే హిందూ మతంలో హనుమాజ్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం రోజు హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభకరం. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఉపవాసం ఉంటారు. ఆరోజు పూజలు చేయడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తారు. హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదని విషయాలు తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి రోజు చేయకూడని పనులు
హనుమాన్ జయంతి రోజు మాంసం, మద్యం పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఆరోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలి. ఈరోజున విరిగిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజించకూడదు. దాన్ని దేవాలయంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలి. మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేయాలి. హనుమంతుడిని పూజించేందుకు ఎరుపు, నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున తెలుపు, నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటమే మంచిది. ఇలా చేస్తే హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయి. మరీ ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతాన్ని పెట్టకూడదు. వాటితో అభిషేకం చేయకూడదు. భజరంగ్ బలికి ఇష్టమైన శనగపప్పు, బూందీ లడ్డు, సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఈరోజు ఉప్పు లేదా రాతి ఉప్పు తినకూడదు.

Share This Article
Leave a comment