తెలుగు వాళ్లు చేసుకునే ముఖ్యమైన పండుగల్లో దసరా ఒకటి. ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైనది.. ఇక అమ్మవారిని భక్తి ఈ నవరాత్రుల్లో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గామాతను భక్తిశ్రద్ధలతో పూజిస్తే అమ్మవారి ఆశీస్సులు తమపై ఉంటాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఈ నవరాత్రులు చాలా పవిత్రంగా ప్రత్యేకంగా భావిస్తారు. ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు.. అవేంటో చూద్దాం..
నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు ఇంట్లో అమ్మవారిని పూజించేవారు ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అమ్మ వారిని ఇంటికి ఆహ్వానించాలంటే ఉదయం సూర్యోదయానికి కనీసం గంట ముందు నిద్ర లేవాలి. దీని తర్వాత స్నానం చేసి అమ్మవారిని పూజించాలి. ఇలా చేస్తే దుర్గామాత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త కుండీ అస్సలు ఉండకూడదు.. ఎప్పుడు ముగ్గుతో గుమ్మం అందంగా ఉండాలి..
బయట ఎక్కడైనా పొరపాటున కూడా మహిళను అవమానించకూడదు. ఇలా చేయడం వల్ల దుర్గామాతకు కోపం వస్తుంది. అంతే కాకుండా లక్ష్మీదేవి కూడా శపిస్తుంది. అమ్మవారు శాపం పెడితే జీవితంలో ఎన్నో రకాల బాధలు అనుభవించాల్సి వస్తుంది.. ఇక రాత్రి భోజనం చేశాక పాత్రలను మొత్తాన్ని శుభ్రం చెయ్యడం మర్చిపోకండి. ఎంత శుభ్రంగా ఉంటే మంచిది. నవరాత్రుల తొమ్మిది రోజుల్లో ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాంసం, చేపలు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి తీసుకోకపోవడం మంచిది.