Avarkhod Hanuman Temple: ఈ గ్రామంలో పెళ్లిళ్లు చేసుకోరు.. ఎందుకో తెలుసా?

Telugu BOX Office

With a history of 500 years, the Avarkhod Hanuman temple is located in the Avarkhod village, Karnataka where people make no noise

ఎన్నికల సమయంలోనూ, ఆలయాల్లోనూ, వినాయక ఉత్సవాల సందర్భంగానూ వీధికో మైకు మార్మోగిపోతుంటుంది. పెళ్లిళ్ల సమయంలో బరాత్‌, మంగళవాద్యాలూ, దీపావళి వేళ టపాసుల గురించైతే చెప్పక్కర్లేదు. కర్ణాటకలోని బెళగావి జిల్లా అవరఖోడలో మాత్రం అలాంటి ఆర్భాటాలేమీ కనిపించవు. గ్రామమెప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. పెళ్లిళ్ల సమయంలో మంగళవాద్యాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఊళ్లో వివాహాలు చేసుకోరు. చుట్టుపక్కల గ్రామాల్లోనే వేడుకలన్నీ జరుపుకుంటారు.

కులవృత్తులైన కుమ్మరి, కమ్మరి, వడ్రంగి వాళ్లు సైతం గ్రామం వెలుపలే తమ పనులు చేసుకుంటారు. అయినా ఊరంతా ఎందుకు నిశ్శబ్దాన్ని పాటిస్తోందీ అనుకుంటున్నారు కదూ… అవరఖోడలోని ఆలయంలో కొలువైన హనుమంతుడు తపస్సులో ఉన్నాడనీ, ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించకూడదనీ ఆ ఊళ్లో ఎలాంటి శబ్దాలూ చేయరు. ఆరొందల కుటుంబాలు నివాసముండే ఆ గ్రామంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, టీవీలు చూస్తారు తప్ప మరేవిధమైన శబ్దాలూ రాకుండా జాగ్రత్తపడతారు. ఒకవేళ ఎవరైనా సౌండ్‌ చేస్తే వారికి చెడు జరుగుతుందని భావించే గ్రామస్థులు దీపావళినీ, ఇతర వేడుకల్నీ కూడా దూరం పెట్టి మౌనంగా దైవారాధన చేస్తున్నారు.

Share This Article
Leave a comment