గొప్ప శైవ క్షేత్రం తిరువ‌ణ్ణామ‌లై!

Telugu Box Office

తిరువణ్ణామ‌లై భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువన్నమలై జిల్లాలో వెల‌సిన ఒక దివ్య‌మైన పుణ్య‌ క్షేత్రము . అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువణ్ణా మలై లోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రంగా రాణిస్తోంది. భ‌క్త‌కోటితో ఆరాదింప‌బ‌డుతోంది. తిరువణ్ణామ‌లై తో చాలా యోగులకు, సిద్ధులకు,దైవ‌భక్తిప‌రాయ‌ణుల‌కు సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువన్నమలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.

పుణ్య క్షేత్రం

తిరువణ్ణామ‌లై పంచ భూత క్షేత్రాలలో ఒకటి. ఇది అగ్నిని సూచిస్తుంది. మిగిలిన పంచ భూత క్షేత్రాలు చిదంబరం, శ్రీ కాళహస్తి, తిరువనైకోవిల్ మరియు కంచి వరుసగా ఆకాశము, గాలి, నీరు మరియు భూమిని సూచిస్తాయి.ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం వెలిగించే రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు

ప్రతి పౌర్ణమి నాటి రాత్రి, వేలకొలది భక్తులు అరుణాచల కొండ చుట్టూ పాద‌ర‌క్ష‌లు లేకుండానే ప్రదక్షిణాలు చేసి శివుని ఆరాధిస్తారు. ఈ ప్రదక్షిణ 14 కి.మీ. ఉంటుంది ప్రతి ఏడాది, తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర పౌర్ణమి రాత్రి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తారు.అద్వైత వేదాంత గురువు రమణ మహర్షి తిరువణ్ణామ‌లై లో 53 సంవత్సరాలు నివసించి 1950లో పరమపదించారు. అయన ఆశ్రమం అయిన శ్రీ రమణాశ్రమము అరుణాచల కొండ దిగువన, ఈ నగరానికి పశ్చిమాన ఉంది. శేషాద్రి స్వామి మరియు యోగి రామ్ సూరత్ కుమార్ ఈ నగరానికి చెందిన ఇతర గురువులకు ఉదాహరణలు.

తిరువణ్ణామ‌లై చెన్నైకి 185 కి.మీ. దూరంలోను, బెంగళూరుకి 210 కి.మీ. దూరంలోను ఉంది. తెన్పెన్నై నది మీద ఉన్న సాతనూర్ ఆనకట్ట తిరువణ్ణామ‌లై దగ్గరలోని పర్యాటక ప్రదేశం. అరుణాచల కొండ ఎత్తు దాదాపు 1,600 అడుగులు.2001 నాటికిభారత జనాభా లెక్కల ప్రకారం తిరువన్నమలై జనాభా 130,301.

అరుణాచలేశ్వర గుడి గోపురాలు

అరుణాచల క్షేత్రం ఈ శివుని గుడి తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ రాజులచే 9వ మరియు 10వ శతాబ్దాల మధ్యలో నిర్మింపబడింది. ఈ క్షేత్రం చాలా పెద్ద గోపురాల వల్ల ప్రసిద్ధి చెందింది. క్రి. శ. 9వ శతాబ్ద కాలంలో రాజ్యమేలిన చోళ రాజుల శిలాశాసనాల వల్ల ఈ విషయం తెలుస్తున్నది. 11 అంతస్తుల తూర్పు రాజ గోపురం 217 అడుగుల ఎత్తు ఉంది. కోట ప్రకారంలా ఉండే బలిష్టమైన గోడల నుండి చొచ్చుకు వచ్చే నాలుగు గోపురాలు, ఈ మందిర సముదాయానికి భీకర ఆకారాన్ని ఇస్తాయి. పై గోపురము, తిరుమంజన గోపురము మరియు అన్ని అమ్మాళ్ గోపురము ఈ ప్రాకారానికి ఉన్న మిగిలిన గోపురాలు.

విజయ నగరాన్ని పాలించిన శ్రీ కృష్ణ దేవరాయలు వేయి స్తంభాల శాలను, కోనేరును నిర్మించాడు. ప్రతి ప్రకారము ఒక పెద్ద నందిని, వల్లల మహారాజ గోపురము, కిల్లి గోపురము వంటి చాలా గోపురాలను కలిగి ఉంటుంది. పంచ భూతాలను సూచించే పంచభూత స్థలాలలో ఇది ఒకటి. పంచ భూత స్థలాలో ఇది తేజో క్షేత్రం – అగ్నిని సూచిస్తుంది. మిగిలినవి – తిరివన్నై కోవిల్ (ఆపః స్థలం – నీరు) కంచి (పృథ్వీ స్థలం – భూమి) శ్రీ కాళహస్తి (వాయు స్థలం – గాలి) చిదంబరం (ఆకాశ స్థలం – ఆకాశం).

వెళ్లే మార్గం

రహదారులతో తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న పట్టణాలు, నగరాల నుండి తిరువణ్ణామ‌లై చేరుకోవచ్చు. ఈ నగరం పుదుచేరి – బెంగళూరు జాతీయ రహదారి (NH 66) చిత్తూరు – కడలూరు రాజ్య రహదారుల కూడలిలో ఉంది. తమిళనాడులోని ఇతర నగరాలు చెన్నై, వేలూరు, సేలం, విల్లుపురం, తిరుచి, మదురై, కోయంబత్తూరు, ఈరొద్, తిరుప్పురు, ఇంకా కన్యాకుమారి, మరియు ఇతర ప్రాంతాలైన తిరుపతి, బెంగళూరు, పుదుచేరి వంటి నగరాలకి తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ తిరువన్నమలై నుండి బస్సులను నడుపుతుంది.

రైలు రవాణా

వెల్లూరు నుండి విల్లుపురం వెళ్ళే రైలు మార్గంలో తిరువణ్ణామ‌లై ఉంది. ప్యాసింజరు రైలులో ప్రయాణికులు వెల్లూరు లేదా విల్లుపురం వెళ్ళవచ్చు. (గేజు మార్పిడి పనుల కోసం ఈ మార్గంలో రైలు రాక పోకలను ప్రస్తుతం నిలిపి వేసారు.) దగ్గరలో ఉన్న పెద్ద రైల్వేస్టేషన్ 60 కి.మీ. దూరంగా ఉన్న విల్లుపురంలో ఉంది. తిరువణ్ణామ‌లై నుండి దిండివనం మీదుగా చెన్నై వరకు కొత్త రైలు మార్గం నిర్మాణంలో ఉంది.

Share This Article