10 బిలియన్స్ దాటిన యూపీఐ చెల్లింపులు.. ఆగస్టులో సరికొత్త రికార్డ్

Telugu BOX Office

నేడు మనదేశంలోని UPI గురించి తెలియని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. దాని తెలుసుకోవడమే కాదు అది ప్రతిరోజూ కూడా ఉపయోగిస్తున్నారు కూడా. కూరగాయలు కొనడం దగ్గరనుంచి మొదలుకుని కరెంటు లేదా మొబైల్ బిల్లులు చెల్లించడం వంటి అన్ని పనులను UPI సులభతరం చేసింది. భారతదేశంలోని సామాన్య ప్రజల దగ్గరకు డిజిటల్ చెల్లింపులను తీసుకెళ్లడంలో UPI కీలక పాత్ర పోషించింది. దాని ప్రారంభం నుండి ఇది ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ప్రత్యేక రికార్డులను సృష్టించింది.

ఇప్పుడు UPI అటువంటి మరొక గొప్ప రికార్డ్‌కి చేరువలో ఉంది. దీని గణాంకాలు చూసిన తర్వాత కూడా నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. ఆగస్టు నెలలో, UPI డిజిటల్ చెల్లింపుల్లో ఎవరెస్ట్‌ అంత ఎత్తుకు ఎదిగింది. బహుశా ఆగస్టు నెలలో మొత్తం UPI లావాదేవీల సంఖ్య 10 బిలియన్లను దాటినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆగస్టు నెల చరిత్రలో నిలిచిపోనుంది. NPCI ఆగస్టు 29న చెల్లింపులకు సంబంధించి కొన్ని గణాంకాలను పంచుకుంది. ఈ నెల 29 వరకు UPI లావాదేవీల సంఖ్య 9.88 బిలియన్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన 2 రోజుల్లో ఈ సంఖ్య 10 బిలియన్లు దాటుతుందనడంలో అతిశయోక్తి కనిపించడం లేదు.


నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా ప్రకారం, జూలై నెలలో దేశంలో మొత్తం 9.96 బిలియన్ల UPI చెల్లింపులు జరిగాయి. విలువ ప్రకారం ఈ సంఖ్య రూ.15.34 లక్షల కోట్లు అవుతుంది. ఆగస్టులో UPI చెల్లింపు వేగం మరింత పెరిగింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆగస్టు నెలలో UPI చెల్లింపులు సగటున 300 మిలియన్ల రోజువారీ చెల్లింపులు జరిగాయి. UPIకి రూ. 10 బిలియన్ల సంఖ్య పరిమితి కాదు. రూ. 10 బిలియన్ల స్థాయికి చేరుకున్నప్పటికీ UPI ఇంకా పెరగడానికి చాలా స్కోప్ ఉందని స్ట్రాటజీ, ఇన్నోవేషన్ అండ్ అనలిటిక్స్ హెడ్, వరల్డ్‌లైన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ రొంగలా చెప్పారు.

Share This Article
Leave a comment