వేరే మతస్తుడికి టీటీడీ ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారు?

TBO
By TBO

టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియామకంపై తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు… ఆయన కూతురి వివాహం ఏ మత సంప్రదాయంలో చేశారు.. అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఏ మతానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారని నిలదీశారు. సనాతన ధర్మం, హిందూ సంప్రదాయంపై ఎలాంటి అవగాహనలేని వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టి.. హిందూ ప్రజలను తీవ్రంగా అవమానిస్తున్నారని విమర్శించారు. హిందూ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వటాన్ని.. తెలుగు రాష్ట్రాల హిందూ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గమనించాలని పిలుపునిచ్చారు.

Share This Article