ఓ వైపు వ్యాపారం.. మరోవైపు రాజకీయం.. సామాజిక సేవలోనూ ముందంజ
తాండూరు ప్రజలకు ఆపన్నహస్తం అందిస్తోన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సామాజిక సేవ చేయడంలో దూసుకుపోతున్నారు. రాజకీయ నాయకుడిగా.. సామాజిక సేవకుడిగా విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటు అందిస్తూ సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించే విధంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. రాజకీయ నాయకులంటే ప్రజలను ఓటుబ్యాంకు చూస్తారని.. ఎన్నికలు వచ్చినప్పుడు వారి వద్దకు వెళ్లి హడావుడి చేస్తుంటారని అపోహ ఉంది. అయితే బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. సంవత్సరంలో 365 రోజులు ఆయన ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి సమయం కేటాయిస్తుంటారు. నియోజకవర్గం నుంచి ఎవరైనా సమస్యల్లో ఉన్నామని చెబితే చాలు నేనున్నానంటూ అక్కడ వాలిపోతుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సామాజికవేత్తగా తాండూరు నియోజకవర్గంలో గుర్తింపు పొందారు. పార్టీలకు అతీతంగా ఆయన్ని అందరూ అభిమానిస్తుంటారు.
నిరాడంబరమైన కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీనివాస్ రెడ్డి నిరాడంబరమైన తన ప్రయాణాన్ని అదే మార్గంలో కొనసాగిస్తున్నారు. ఓ వైపు వ్యాపారవేత్తగా.. మరోవైపు రాజకీయ నేతగా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ప్రజా సంక్షేమంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. చిన్న వెంచర్తో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన నైపుణ్యం, నిబద్ధతతో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. తాను ఇంత పైకి ఎదగడానికి తోడ్పడిన సమాజానికి తిరిగి ఏదైనా చేయాలన్న సంకల్పమే ఆయన్ని గొప్ప మానవతామూర్తిగా నిలబెట్టింది. విద్యను ప్రోత్సహించడం, పర్యావరణ సుస్థిరతపై పని చేయడం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు మొదలైన లెక్కలేనన్ని వ్యక్తుల జీవితాల్లో స్పష్టమైన మార్పును కలిగించే అనేక రచనలు చేశారు.
శ్రీనివాస్ రెడ్డి చేసిన కొన్ని సామాజిక సాయాలు:
పాఠశాలలకు విద్యా నిధులను అందించడం.
శ్రీ సాయి రామ్ ఎంటర్ప్రైజెస్కు ప్లాంటేషన్ నిధులు కేటాయించడం.
శ్రీ నాగలక్ష్మి నర్సరీకి నిధులు ఇవ్వడం.
జక్కేపల్లిలో వాటర్ ట్యాంక్ నిర్మాణం.
పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు.
సామాజిక సేవే కాకుండా ప్రజారోగ్యంపైనా ఆయన ఎంతో పోరాటం చేశారు. పర్యావరణం బాగుంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్న నినాదమే ఆశయంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవ తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీటి సమస్య గురించి తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి సొంత ఖర్చుతో బోరు తవ్వించారు. అంతే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇటీవల తాండూరు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.5 లక్షల నిధులను కేటాయించగా… యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి రూ.30 లక్షలు విరాళంగా అందజేశారు.
తాండూరులో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందుంటారు. తన నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమవుతూ గ్రామాల్లో పర్యటిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎవరు సహాయం అడిగినా లేదనకుండా తనవంతు సాయం చేస్తుంటారు. విద్యా కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం నుండి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వరకు ఆయన దాతృత్వం సమాజంపై చెరగని ముద్ర వేసింది.
వివిధ పాత్రలను విజయవంతంగా సమతూకం చేయగల సామర్థ్యం శ్రీనివాస్ రెడ్డి విశేషమైన లక్షణాల్లో ఒకటి. బోర్డ్రూమ్లో అయినా, రాజకీయ వేదికపైనా లేదా కమ్యూనిటీలతో పనిచేసే రంగంలో అయినా ఆయన ప్రతి పరిస్థితికి వ్యూహాత్మక ఆలోచన, దృఢత్వంతో ప్రత్యేక కలయికను అందిస్తారు. ఆయన రాజకీయ జీవితం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు ఆదర్శమని చెప్పొచ్చు. వ్యాపారం, రాజకీయం ఇలా రెండు పడవలపైనా ప్రయాణిస్తూనే ప్రజలతో మమేకమవుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి.