రాగిడి లక్ష్మారెడ్డి… నాయకుడే కాదు సేవకుడు కూడా

Telugu BOX Office

మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న ఆయన గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఉప్పల్ నియోజకవర్గ టికెట్‌ని ఆశించి భంగపడ్డారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ దృష్టిలో పడ్డారు. దీంతో ఆయన మీద నమ్మకంతో కేసీఆర్ మల్కాజ్‌గిరి లోక్‌సభ టిక్కెట్ ఇచ్చారు.

మల్కాజిగిరి  పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన వెంటనే రాగిడి లక్ష్మారెడ్డి దాని పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి తన గెలుపునకు సహకరించాలని కోరారు. అంతేకాకుండా కేడర్‌తో తరుచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ అందరికీ సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూనే… తాను కూడా మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేసిన సేవలను గుర్తుచేస్తున్నారు.

మల్కాజ్‌‌గిరి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం ఆయనకు పెద్ద సానుకూలంగా చెప్పొచ్చు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఉప్పల్‌కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు కావడం.. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుండటంతో ప్రజల్లో మంచి సానుకూలత కనిపిస్తోంది. దీంతో మల్కాజ్‌గిరి నుంచి లక్ష్మారెడ్డి గెలుపు తథ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు స్థానికులు కాకపోవడం, ఆ పార్టీల కేడర్‌లో లుకలుకలు కూడా ఆయనకు కలిసొచ్చేలా కనిపిస్తోంది.

ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో రాగిడి లక్ష్మారెడ్డి ఎప్పుడూ ముందుంటారని.. బీఆర్ఎస్ చేరిన సమయంలో కేసీఆర్ చెప్పడంతో పార్టీ కేడర్‌ ఆయనకు సంపూర్ణంగా మద్దతుగా నిలుస్తోంది. దీంతో మే 13న జరిగే ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాగిడి లక్ష్మారెడ్డి ప్రస్థానం
రాగిడి లక్ష్మారెడ్డి తన తల్లి మెమోరియల్‌గా 2006లో మధుర ఛారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించారు. సుమారు 48వేల మందికి సేవలు అందించి వారి జీవితాలను తీర్చిదిద్దారు. పేదలు, అణగారిన వర్గాలు, అభాగ్యుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటివరకు 2వేల మంది పేదలకు కంటి ఆపరేషన్లు నిర్వహించి పదివేల మందికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. 3వేల మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్‌లు అందజేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, వరద బాధితులకు ఇలా సుమారు వెయ్యి మందికి పైగా ఆర్థికసాయం అందించారు. 15వేల మందికి ప్రయోజనం చేకూర్చే ఉపాధి మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. 4వేల మంది వృద్ధ మహిళలు, పేద వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

యువత కోసం దాదాపు 500 క్రీడలు మరియు ఆటల పోటీలను మధుర ట్రస్ట్ ద్వారా నిర్వహించి అవార్డులు అందజేశారు. వందల సంఖ్యలో ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. మహాత్మాగాంధీ జయంతి వంటి ముఖ్యమైన రోజుల్లో దాతల నుంచి బియ్యం, మందులు, దుస్తులు సేకరించి వాటిని పేదలకు పంపిణీ చేస్తుంటారు.

ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనలో రాజకీయ నాయకుడే కాదు మానవతావాది కూడా ఉన్నాడని రాగిడి లక్ష్మారెడ్డి నిరూపిస్తున్నారు. ఆయన చేసిన సేవలకు గాను 2009లో నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, 2013లో రాజీవ్ రత్న అవార్డు వరించాయి. అట్టడుగు వర్గాలకు సేవ చేయడంలో ఆయన అంకితభావం, సామాజిక న్యాయం కోసం ఆయన పాటుపడే కృషి ఆయనకు ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.

మహిళలు, పేద, బలహీన వర్గాల సంక్షేమం అందించాలంటే బీఆర్ఎస్ పార్టీయే సరైనదని కనుగొన్న రాగిడి లక్ష్మారెడ్డి ఎలాంటి షరతులు లేకుండా ఆ పార్టీలో చేరారు. అయితే ఆయన నిబద్ధత గురించి తెలుసుకున్న కేసీఆర్ మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. సాధారణంగా రాజకీయ నాయకులంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూకబ్జాలు చేస్తారని.. అప్పనంగా కాంట్రాక్టులు పొంది ప్రజాధనం దోచుకుంటారని చాలామందిలో అపోహ ఉంటుంది. అయితే రాగిడి లక్ష్మారెడ్డి ఆ కోవకు చెందిన నేత కాదు. తనకు చేతనైనంతలో ప్రజలకు సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇక అవినీతి, అక్రమాలు ఆరోపణలు ఆయన దరిచేరవు. క్లీన్ ప్రొఫైల్‌ కలిగిన రాగిడి లక్ష్మారెడ్డి లాంటి నేతలను చట్ట సభలకు పంపిస్తే ప్రజలకు మేలు కలుగుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయం పడుతున్నారు. స్థానికుడు కావడం, బలమైన బీఆర్ఎస్ కేడర్‌, ఆ సెగ్మెంట్‌లోని ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతుతో రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు నల్లేరు మీద నడకలానే కనిపిస్తోంది.

Share This Article
Leave a comment