విజయ్ దేవరకొండ , పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ ఆగస్ట్ 25న థియేటర్లలోకి రావడం ప్రేక్షకులని నిరాశపరచడం జరిగిపోయాయి. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌తో మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ.. రెండో రోజు చాలా చోట్ల ఈ సినిమాకి సరిగా థియేటర్స్ ఫిల్ కాలేదు. దీంతో భారీ పరాజయం తప్పదు అనేలా అప్పుడే సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ టామ్ టామ్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందు.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీ కౌర్ ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.
విజయ్, పూరీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమా నిర్మాణం సమయంలో మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సమయంలో మాకు ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చింది. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ డీల్‌ని కాదనుకున్నాం. అందుకు పూరీగారికి ఎన్ని ఘట్స్ కావాలి’’ అంటూ చార్మీ విషయం రివీల్ చేసింది. ఈ విషయం చెబుతూ ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకి ఓటీటీ డీల్ రూ. 200 కోట్లు (డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసేందుకు) వచ్చిందట. దానిని వారు ఎందుకు కాదని అనుకున్నారో? ఇంతోటి సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందో? అంటూ ఛార్మిని, పూరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ కురిపిస్తున్నారు. ఇప్పుడున్న టాక్ ప్రకారం ఈ సినిమా రూ. 50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అలాగే, ఇప్పుడు ఓటీటీ డీల్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో.. చేజేతులా రూ. 200 కోట్లు హుష్ కాకి అనేలా.. సినిమాపై ఉన్న ‘నమ్మకం’తో పూరి, ఛార్మీ అండ్ టీమ్ పోగోట్టుకున్నట్లేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.