మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటికానున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం జరిగిన క్షణం నుంచే వారి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ చేసుకుంటారు? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో.. ఈ ఏడాది చివర్లో వారి వివాహం జరిగే అవకాశం ఉందంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై వరుణ్‌తేజ్ క్లారిటీ ఇచ్చాడు. తన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై స్పందించారు.
‘‘మా వివాహం నవంబరు లేదా డిసెంబరులో ఉండొచ్చు. హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం. కానీ ప్రైవేట్ వ్యవహారంగా ఉంచాలనుకోవడం వల్ల అది ఇక్కడ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో, డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. దానికోసం ఇండియాలోని మూడు ప్రాంతాలు, విదేశాల్లో రెండు ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. త్వరలోనే వీటిలో ఏదొక ప్రాంతాన్ని త్వరలోనే ఎంపిక చేస్తాం’’ అని వరుణ్ తేజ్ తెలిపాడు.
లావణ్య త్రిపాఠి, తాను ఐదేళ్ల నుంచి స్నేహితులమని, తానే మొదట ప్రపోజ్ చేశానని వరుణ్ తేజ్ చెప్పాడు. తాను వాడుతున్న ఫోన్‌ను లావణ్య గిఫ్ట్‌గా ఇచ్చిందని తెలిపాడు. ‘మిస్టర్’ సినిమాలో తొలిసారి లావణ్య- వరుణ్ కలిసి నటించారు. ఆ సినిమా ప్రయాణంలోనే వీరిద్దరూ స్నేహితులయ్యారు. ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పీహెచ్’ సినిమాలోనూ కలిసి నటించారు. జూన్ 9న వీరి నిశ్చితార్థం జరిగింది.