ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి గడ్డు కాలం ఎదురైంది. కరోనాతో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలందరూ ఓటీటీలకే అంకితమైపోయారు. సినిమా థియేటర్ల వైపు ప్రజలు రావడం మానేస్తారని అందరు అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా హాళ్ల వైపు ప్రజలు పోటెత్తడం మొదలుపెట్టారు. దీంతో సినిమాలకు ఏమి కాదని అర్థమైంది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన 10సినిమాల జాబితాను ప్రతి ఏడాది గూగుల్ ఇండియా విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆ జాబితాను గూగుల్ ఇండియా విడుదల చేసింది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన చిత్రంగా ‘‘జై భీమ్’’ నిలిచింది. నెటిజన్లు అత్యధికంగా వెతికిన టాప్ 10 సినిమాల జాబితాపై ఓ లుక్కేద్దామా..
- జై భీమ్
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించారు. మంచి కథాంశంతో రూపొందడంతో పాటు వివాదాలు కూడా చుట్టుముట్టడంతో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన ఈ సినిమాకు టీజే. జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థపై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
- షేర్‌షా
సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ హీరో, హీరోయిన్లుగా నటించారు. కార్గిల్ యుద్ధంలో అసమాన ప్రతిభ పాటవాలను చూపిన విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. విష్ణువర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. - రాధే
కొరియన్ చిత్రం ‘‘ద అవుట్ లాస్’’ రీమేక్‌గా రాధే తెరకెక్కింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటానీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ ప్లెక్స్ వేదికగా విడుదల అయింది. ఈ మూవీ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. - బెల్ బాటమ్
అక్షయ్ కుమార్, వాణీకపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానీ నిర్మాతగా వ్యవహరించారు. హైజాక్ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కింది. రంజిత్ తివారి దర్శకత్వం వహించారు.
5.ఎటర్నల్స్
మార్వెల్ కామిక్స్‌కు చెందిన అమెరికన్ సూపర్ హీరోలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. మార్వెల్ కామిక్స్‌లో ఇది 26వ చిత్రం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.
- మాస్టర్
కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ఈ సినిమాలో సందడి చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తయినప్పటికి కరోనా కారణంగా వాయిదాపడింది. సంక్రాంతి కానుకగా థియేటర్లల్లో విడుదల అయిన ఈ చిత్రానికి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. - సూర్యవంశీ
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఓటీటీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికి ఈ చిత్రాన్ని సినిమా హాళ్లల్లోనే విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం విశేషం. - గాడ్జిల్లా vs కాంగ్
ఆడమ్ విన్ గార్డ్ ఈ సినిమాను తెరకెక్కించారు. భారతీయ భాషల్లోను ఈ చిత్రం సందడి చేసింది. గ్రాఫిక్స్‌తో ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రపంచం మీద విరుచుకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్ ఎలా చెక్ పెట్టిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. - దృశ్యం-2
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2013లో విడుదలైన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం-2 తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ చిత్రం విడుదలయింది. - భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా
అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా నటించారు. దేశభక్తి కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. డిస్నీ+హాట్ స్టార్ వేదికగా ఈ మూవీ విడుదల అయింది.