సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందంతో పాటు ప్రతిభ, అదృష్టం కూడా కలిస్తేనే స్టార్‌డమ్ వస్తుంది. ఈ అన్నింటినీ సొంతం చేసుకున్న బ్యూటీ తమన్నా. ఉత్తరాది భామ అయినప్పటికీ దక్షిణాదిలోటాప్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా రాణించిన తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె కెరీర్‌లో కొంత బ్రేక్ పడింది. స్పెషల్ సాంగ్స్ తప్పించి చెప్పుకోతగ్గ పాత్రలు రావడం లేదు. ఇటీవల ‘ఓదెల 2’లో కీలకపాత్ర పోషించినా అది ఫ్లాప్ కావడం ఇబ్బందిగా మారింది. అయితే కెరీర్ బిగినింగ్ లో ఈ ముద్దుగుమ్మ చాలా పద్దతిగా నడుచుకున్నప్కటికి , ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చింది.. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనికి కారణమేంటో చెప్పుకొచ్చింది.

“నేను ఎప్పటినుంచో కసరత్తులు చేస్తూ ఉన్నా. కానీ నాకు శరీరం ఏం చెబుతుందో అదే చేస్తాను. బలవంతంగా ఏదీ చేయను. అలసటగా ఉన్నా, నిద్ర సరిగా లేకపోయినా, వర్కౌట్ మానేసి విశ్రాంతిని ప్రాధాన్యం ఇస్తాను” అని చెప్పారు. అలాగే, తనకు ప్రశాంతమైన ప్రదేశాలు, ధ్యానం చేయడం, దేవాలయాలకు వెళ్లడం చాలా ఇష్టమని తెలిపారు. “నాకు గ్లామరస్ నటిగా ముద్ర వేసేశారు. కెరీర్ ప్రారంభంలోనే కొన్ని నిబంధనలు పెట్టుకోవడంతో శక్తివంతమైన పాత్రలను కోల్పోయాను. నో-కిస్ పాలసీని కఠినంగా పాటించాను. కానీ ఆ ఆంక్షలు వదిలేసిన తర్వాత బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్ చేయడం మొదలెట్టాను. అదే నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది” అని చెప్పుకొచ్చింది.
