సమంత, నాగచైతన్య ప్రేమించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట కొంతకాలానికే విడాకులు తీసుకుని విడిపోయారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ వీరిద్దరిని సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్‌గా మారుతూనే ఉంటాయి.
వీరికి సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగచైతన్యతో విడిపోయినప్పటికీ సమంత అమెరికా వెళ్లినప్పుడల్లా ఆయన తల్లి దగ్గుబాటి లక్ష్మిని కలుస్తోందట. ఇటీవల అమెరికా వెళ్లిన సమంత…. శ్రీలక్ష్మిని కలిసినప్పుడు అమల గురించి నమ్మలేని నిజాలు బయటపెట్టినట్లు టాక్.
‘‘ఆ ఇంట్లో ఉండే మనుషులు మొత్తం విచిత్రమైన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో వాళ్లకే తెలియదు అని తన అత్తకు తెలిపిందట. ఒకానొక సందర్భంలో నా స్వేచ్ఛను మొత్తం పోగొట్టుకొని జైలులో ఉన్నట్లు అనిపించిందని, కష్టమైన ఆంక్షలు పెట్టే వారని ముఖ్యంగా అమల పెట్టే కండిషన్స్ తాను తట్టుకోలేక పోయేదాన్ని అంటూ సమంత, లక్ష్మికి చెబుతూ ఏడ్చేసిందట. అలాగే నాగచైతన్య కూడా తనను అపార్థం చేసుకున్నాడని దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయిందని సమంత తన మాజీ అత్తకి చెప్పిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో కాదో తెలీదు గానీ ఈ వార్త మాత్రం తెగ షికారు చేస్తోంది.