బాలయ్యకు లేడీ విలన్‌గా ఐశ్వర్య రాజేశ్?… కొరటాల శివ సినిమాలో క్రేజీ ట్విస్ట్!

Telugu BOX Office

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రూపుదిద్దుకోనున్న భారీ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. మాస్ ఎలిమెంట్స్‌ను బలమైన సామాజిక కథాంశంతో జోడించి మెప్పించే కొరటాల, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమా కాస్టింగ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో విలక్షణ నటి ఐశ్వర్య రాజేశ్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఆమె రెగ్యులర్ హీరోయిన్‌గా కాకుండా, నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు పద్ధతైన పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఐశ్వర్య, బాలకృష్ణకు పోటీగా లేడీ విలన్‌గా రూపాంతరం చెందడం ఈ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశం చేసిన ఐశ్వర్య రాజేష్, ఆ తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘ఓ! సుకుమారి’ సినిమాల విజయాలతో ఆకట్టుకున్న ఆమెకు, బాలయ్య సినిమాలో నటించే అవకాశం రావడం కెరీర్‌లో కీలక పరిణామంగా మారనుంది.

సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఐశ్వర్య ఎంపికపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా రూపొందుతున్న సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. బాలయ్య రౌద్రం, కొరటాల మేకింగ్, ఐశ్వర్య పవర్‌ఫుల్ విలనిజం కాంబినేషన్ వెండితెరపై ఏ రేంజ్ హంగామా సృష్టిస్తుందో చూడాలి.

Share This Article
Leave a Comment