అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. నువ్వు బంగారం సామీ

Telugu BOX Office

కర్నూలు జిల్లాలో హీరో నందమూరి బాలకృష్ణను కలవడానికి వచ్చిన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో నందమూరి బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణను కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని సజ్జద్ కావడానికి వెళ్ళాడు. అనుమతి తీసుకుని షూటింగ్ గ్యాప్ లో బాలయ్యతో కలిసి మాట్లాడాడు. ఈ క్రమంలో ఆ అభిమానితో కలిసి నందమూరి బాలకృష్ణ భోజనం చేశారు. అనంతరం బాలకృష్ణ అభిమాని సజ్జద్ మాట్లాడుతూ.. తాను నందమూరి బాలకృష్ణ వీరాభిమానినని… అందుకే ఆయన్ని కలవడానికి వచ్చినట్లు చెప్పాడు. అంతే కాకుండా ఆయనతో పాటు కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు సజ్జద్.

ఇక బాలయ్య తన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి బాలకృష్ణకు ముక్కు మీదే కోపం ఉంటుందని అభిమానులను కొడతాడని రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి. దానికి తోడు కాస్త ఓవరాక్షన్ చేసిన అభిమానుల మీద ఆయన చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉండేవి. అలాంటి బాలయ్య ఇమే‌జ్‌ని Unstoppable With NBK షో ఒక్కసారిగా మార్చేసింది. తాజాగా అభిమానికి బాలయ్య భోజనం పెడుతోన్న వీడియోను వైరల్ చేస్తోన్న అభిమానులు.. మా బాలయ్య బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share This Article
Leave a comment