‘మహావతార్ నరసింహ’ జోరు: 10 రోజుల్లో ₹105 కోట్లు

Telugu BOX Office

మాస్ సినిమాలు, భారీ యాక్షన్, రొమాంటిక్ సినిమాలు కాకుండా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్ర డైరెక్టర్స్ కూడా కొత్తగా సినిమాలు ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉంటున్నారు. ప్రస్తుతం పురాణాలు మీద, దేవుళ్ళ కథలతో కొత్త సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈమధ్య వస్తున్న సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహకు మంచి రెస్పాన్స్ వస్తోంది. హరిహర వీరమల్లుకు పోటీగా ఒక రోజు ఆలస్యంగా రిలీజైన ఈ సినిమా మీద ముందు పెద్దగా అంచనాలు లేవు. తక్కువ షోలు పడ్డ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తాని చాటుతుంది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రూ.105 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

నరసింహ స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూలై 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజికల్‌గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ డే కోటి 70 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టిన  ఈ చిత్రం 10 రోజులకే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది.  ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూనే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. బుక్ మై షో యాప్‌లో గంటకి 10వేలకి పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా దెబ్బకి ఇతర సినిమాల కలెక్షన్లు డ్రాప్ అవుతుండటం ఇండస్ట్రీ వర్గాలని ఆకర్షిస్తోంది. మహావతార్ నరసింహ ఇప్పట్లో శాంతించేలా లేదని అంటున్నారు. ఆగస్ట్ 14న కూలి, వార్ 2 వచ్చేదాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని అంటున్నారు. అసలు ఈ చిత్రానికి ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కూడా ఊహించి ఉండదు.

Share This Article
Leave a Comment