శోభన్‌బాబుని దారుణంగా అవమానించిన ఆ హీరోయిన్ తల్లి

Telugu BOX Office

సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుల్లో ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తుకు పొందిన వారిలో శోభన్ బాబు ఒకరు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఒక్కో మెట్లు ఎదుగుతూ వచ్చారు. అలాంటి సమయంలో సోలో హీరోగా కూడా అతనికి కొన్ని సినిమాల్లో అవకాశాలు రావడం జరిగింది. అతను ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్‌ని అందుకున్నాడు. అప్పటితరం చాలామంది హీరోలతో కలిసి చాలా మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు.

శోభన్ బాబు సినిమాలు అంటే అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా చూసేవారు. అందులో భాగంగానే సోగ్గాడు, గోరింటాకు లాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలకి ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మ రథం పట్టారు. అలాంటి శోభన్ బాబుని ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత తల్లి ఆయన్ని అవమానించారట.

శోభన్ బాబు ఇండస్ట్రీ లో హీరో గా ఎదుగుతున్న క్రమంలో జయలలిత తమిళంలో ఒక్క ఎంజీఆర్‌తోనే ఐదు సంవత్సరాల్లో 32 సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. అదే సమయంలో శోభన్ బాబు మీడియం రేంజ్ హీరోగా ఉన్నాడు. ఒక సినిమాలో శోభన్ బాబు కి జోడీ గా జయలలిత ని తీసుకుందాం అని మేకర్స్ అనుకున్నారట. అయితే మీడియం రేంజ్ హీరోలతో తాను చేయనని జయలలిత నిర్మాతలతో నిర్మొహమాటంగా చెప్పేసిందట.

ఈ ఘటనతో శోభన్‌బాబు చాలా బాధపడ్డారట. ఎప్పటికైనా జయలలితతో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయారట. అయితే శోభన్‌బాబుతో సినిమా చేయనని జయలలిత చెప్పలేదట. అప్పట్లో ఆమె డేట్స్ అన్నీ తల్లే చూసుకునేదట. శోభన్‌బాబు తన కూతురు నటించదని ఆవిడే నిర్మాతలకు చెప్పిందట. ఈ విషయాన్ని మేనేజర్ శోభన్‌బాబుకి చెప్పారట. ఆ తర్వాత శోభన్‌బాబు అగ్రహీరోగా ఎదిగి జయలలితతో అనేక సినిమాల్లో నటించినా ఆమె తల్లి అన్న మాటలు ఆయన్ని ఎప్పుడూ బాధిస్తుండేవట.

Share This Article
Leave a comment