నటి అమలాపాల్ రెండో పెళ్లికి సిద్ధమైందా? ఆమె పుట్టిన రోజు సందర్భంగా వెలుగులోకి వచ్చిన వీడియో ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తోంది. దర్శకుడు విజయ్ను పెళ్లాడి, విడాకులు తీసుకున్న ఈ మలయాళీ భామ.. కొన్నేళ్లుగా సింగిల్‌గా ఉంటోంది. అయితే, కొంతకాలంగా జగత్ దేశాయ్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అమలా పాల్ బర్త్‌డే సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు జగత్ దేశాయ్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
అమలాపాల్‌తో కలిసి స్టెప్పులు వేసిన జగత్ దేశాయ్.. డాన్స్ మధ్యలో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కిస్ చేసుకొని పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ‘నా రాణి యెస్ చెప్పింది’ అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా ద్వారా షేర్ చేశాడు జగత్.
అమలాపాల్ పెళ్లాడబోతున్న జగత్ దేశాయ్ ఎవరు? అతడు ఏం చేస్తాడని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. గోవాలోని ఓ విల్లా గ్రూప్‌లో జగత్ దేశాయ్ ‘సేల్స్ హెడ్’గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచే అమలాపాల్ అతడితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. జగత్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ల కింద అమలాపాల్ లైక్ కొట్టడం, కామెంట్స్ చేయడం కనిపిస్తోంది.