
సుమారు రెండేళ్ల తర్వాత ‘హరిహర వీరమల్లు’తో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాపై ఓ వర్గం ముందు నుంచీ నెగిటివ్ పబ్లిసిటీ చేసినా అవన్నీ తట్టుకుని ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.100 కోట్ల గ్రాస్ దాటేసింది ఈ సినిమా. అయితే ఆక్యుపెన్సీ తగ్గిపోవడందో వారం తిరిగేసరికే ఈ చిత్రం చాలా థియేటర్లలో నుంచి తీసేశారు. ప్రస్తుతం మార్కెట్లో ‘కింగ్‌డమ్’, మహావతార్ నరసింహ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. రెండో వారంలో కూలీ, వార్ 2 చిత్రాలతో బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడనుంది. ‘హరిహర వీరమల్లు’ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ వచ్చే నెల రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దసరా పండగ సందర్భంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకు వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశాయి.
‘రన్ రాజా రన్’ సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కుర్ర డైరెక్టర్ సుజీత్.. తన రెండో సినిమానే ప్రభాస్‌తో సాహో డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేకపోయినా టేకింగ్ పరంగా మంచి మార్కులే అందుకుంది. ఇక టాలీవుడ్‌లో సుజీత్‌కి ఛాన్సులు దక్కవేమో అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేసి ఇండస్ట్రీని షాక్‌కి గురిచేశాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా తెలుగుతెరకు పరిచయమవుతున్నాడు. ఇక ఇప్పటికే OG నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఏ రేంజులో ఆకట్టుకున్నాయో తెల్సిందే. ముఖ్యంగా నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా అంటూ థమన్ పాడిన సాంగ్ ఇంకా టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. హీరోకు ఎలివేషన్ ఇవ్వాలన్నా ఆ సాంగ్ తోనే.. పవర్ ఫుల్ మ్యూజిక్ కావాలన్నా ఆ మ్యూజిక్ నే వాడేస్తున్నారు ఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు థమన్.. OG నుంచి మిగిలిన సాంగ్స్ రిలీజ్ చేస్తాడా.. ? అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ OG నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేశారు. ఫైర్ స్ట్రామ్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ కూడా హీరో ఎలివేషన్ సాంగ్ లానే అనిపిస్తుంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ చుట్టూ జరిగే రక్తపాతాలు.. అతడి గురించి విలన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఈ లిరిక్స్ లో చూపించారు. ఈ సినిమాలో పవన్ పేరు ఓజాస్ గంభీర అని తెలుస్తోంది. వీడియోలో పవన్ ఒక గ్యాంగ్ స్టార్‌గా గొడవలు పడటం చూపించారు. పవన్ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి లిరిక్స్ ను ఎంతో అద్భుతంగా రాసారు విశ్వ, శ్రీనివాస మౌళి. ఇక తెలుగుతో పాటు ఇంగ్లీష్, జపనీస్ లిరిక్స్‌ను కూడా ఇందులో పొందుపరిచారు. మొదటి నుంచి పవన్ సినిమా కోసం శింబు ఒక సాంగ్ పాడుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ అదే. ఇది కచ్చితంగా ఫ్యాన్స్‌కి మంచి ఊపు ఇచ్చే సాంగ్ అని చెప్పొచ్చు.
రణమున యముడిగా కనపరులే.. దురుసుగా నువు చరచకు తొడలే.. బదులుగా తెగి విరిగెను మెడలే.. రక్కసి దారుల రుధిరం పొరలే అంటూ వచ్చే రైమింగ్ లైన్స్ సాంగ్ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సుజీత్ టేకింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్‌ని మునుపెన్నడూ చూడని రీతిలో సరికొత్తగా చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. పవన్ పంజా టైమ్‌లో ఇంత స్టైలిష్‌గా కనిపించాడు. ఈ సాంగ్ బయటికి వచ్చాక ‘ఓజీ’పై అంచనాలు మరింత పీక్స్‌కి వెళ్లిపోయాయి. ఈ రేంజులో పవన్‌ని చూపించిన సుజీత్‌కి గుడి కట్టినా తప్పులేదని పవన్ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.
