వామ్మో… నాగ్ వేసుకున్న షర్ట్ ధర అన్ని రూ.లక్షలా?

Telugu BOX Office

రియాలిటీ షోలకు బాస్‌.. బిగ్‌బాస్‌. ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ కొనసాగుతోంది. ఈసారి డిఫరెంట్‌గా రెండుసార్లు లాంచింగ్‌ పెట్టారు. మొదటి సారి 14 మందిని హౌస్‌లోకి పంపించారు. అందులో ఐదుగురు ఎలిమినేట్‌ అవ్వగానే రెండోసారి మినీ లాంచ్‌ పెట్టారు. ఈసారి ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు. పేరుకు మినీ లాంచ్‌ కానీ చాలా గ్రాండ్‌గానే చేశారు. సిద్దార్థ్‌, రవితేజ వంటి సెలబ్రిటీలను తీసుకొచ్చి సందడి చేశారు.

అయితే ఈ ఎపిసోడ్‌లో నాగార్జున వేసుకున్న షర్ట్‌ చాలామందికి భలే నచ్చేసింది. దీంతో దాని ధర ఎంతుంటుంది? ఎక్కడ దొరుకుతుంది? అని జనాలు నెట్టింట ఆరా తీస్తున్నారు. ఇది లూయిస్‌ వ్యూటన్‌ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ షర్ట్‌. దీని ధర ఎంతో తెలిస్తే గుడ్లు తేలేస్తారు. ఈ చొక్కా ఖరీదు వందలు, వేలల్లో కాదు, ఏకంగా లక్షల్లోనే ఉంది.

అవును… నాగ్‌ ధరించిన ఈ స్టైలిష్‌ షర్ట్‌ ధర రూ.2 లక్షల పై చిలుకు ఉంది. ఇది చూసిన అబ్బాయిలు.. ఇలాంటివి చూసి ఆనందించాలంతే కానీ, కొనుక్కోవాలని ఆశపడకూడదు అని కామెంట్లు చేస్తున్నారు. అటు నాగ్‌ ఫ్యాన్స్‌ మాత్రం.. మరి షో హోస్ట్‌ అంటే మినిమమ్‌ మెయింటైన్‌ చేయాలిగా, అయినా మన్మథుడు ఏ డ్రెస్‌ వేసినా బాగుంటాడు అని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఈ వీకెండ్‌లో బిగ్‌బాస్ షో కంటే మన్మథుడు వేసుకున్న షర్టే హాట్‌ టాపిక్‌గా మారింది.

Share This Article
Leave a comment