ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది శ్రీలీల. ‘పెళ్లిసందD’తో ఓ మోస్తరు హిట్ కొట్టిన శ్రీలీల ‘ధమాకా’తో బంపర్హిట్ని ఖాతాలో వేసుకుంది. ఇటీవలే ‘స్కంద’ ఫలితంతో నిరాశ చెందినా… ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలను లైన్లో పెట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా కొనసాగుతోన్న శ్రీలీల దసరా నుంచి మొదలుపెడితే సంక్రాంతి వరకు నెలకో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ఈమె పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ వచ్చాయి.
‘ధమాకా’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న శ్రీలీల.. రీసెంట్గా ‘స్కంద’తో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ దసరాకి ‘భగవంత్ కేసరి’ సినిమాతో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ కొడుకుతో ఓ ఫొటోలో ఈమె కనిపించింది. అంతే గాసిప్స్, రూమర్స్ అల్లేశారు. అతడితో పెళ్లికి రెడీ అయిందని న్యూస్ వైరల్ అయింది. అయితే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో కుదురుకుంటున్న తనపై ఇలాంటి వార్తలు వచ్చేసరికి శ్రీలీల కాస్త డిస్ట్రర్బ్ అయినట్లు అయింది. పెళ్లి అంటూ వస్తున్న రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇలాంటి వాటిని రాసేముందు నిజం తెలుసుకోవాలని చెప్పుకొచ్చింది. నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.