డీప్ ఫేక్ వీడియోపై రష్మిక రియాక్షన్.. ఎమోషనల్ పోస్ట్

Telugu BOX Office

టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుందని ఆనందపడాలో.. ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో తెలియని సందిగ్ద స్థితిలో ఉంది సమాజం. ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం AI టెక్నాలజీ ఒక ఊపు ఊపేసిన విషయం తెల్సిందే. ఎలాంటి మనిషినైనా AI టెక్నాలజీ మార్చేస్తోంది. ఒకప్పుడు మార్ఫింగ్ వీడియోలు అంటూ.. ఎవరో గుర్తుతెలియని మనుషుల ముఖాల ప్లేస్ లో సెలబ్రిటీల ముఖాలను అతికించి సోషల్ మీడియాలో వదిలేవారు.

ఇప్పుడు అదే AI టెక్నాలజీ తో చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారు. ఇక నేటి ఉదయం నుంచి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. బ్లాక్ కలర్ టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో వల్గర్ గా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు పోజులివ్వడానికి రష్మిక నిలబడిన వీడియో సెన్సేషన్ సృష్టించింది. దీంతో రష్మిక ఏంటి.. ఇలాంటి వీడియో ఏంటి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఒరిజినల్ వీడియో కాదని, ఆ వీడియోలో ఉన్నది రష్మిక కాదని.. వేరే అమ్మాయి ముఖాన్నీ AI టెక్నాలజీతో రష్మిక ఫేస్ పెట్టి రిలీజ్ చేశారు. ఇక దీంతో ప్రతి ఒక్కరు రష్మికకు సపోర్ట్ గా నిలిచారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం.. దీనిపై లీగల్ చర్యలు తీసుకోవాలని తెలిపాడు. ఇక తాజాగా ఈ ఫేక్ వీడియోపై రష్మిక ట్విట్టర్ ద్వారాస్పందించింది.

” ఈ ఘటన గురించి మాట్లాడడం చేయడం నాకు చాలా బాధగా ఉంది. ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడవలసి వచ్చింది. ఇలాంటివి నిజం చెప్పాలంటే.. నాకే కాదు, చాలామందిని భయానికి గురిచేస్తోంది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే భయంతో పాటు.. వాటి వలన నష్టాలు ఎలా ఉంటాయో అని చాలామంది భయపడుతున్నారు. ఈ రోజు ఒక మహిళగా మరియు నటిగా నాకు రక్షణ మరియు మద్దతు వ్యవస్థగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ఇలాంటి ఘటనే నేను స్కూల్‌లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు జరిగితే.. నేను దీన్ని ఎలా ఎదుర్కోగలనో నిజంగా ఊహించలేను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మనమందరం ఒక కమ్యూనిటీగా మారి త్వరగా వీటికి పరిష్కారం చూపాలి” అని తెలుపుతూ సైబర్ క్రైమ్ ను ట్యాగ్ చేసింది రష్మిక . ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

Share This Article
Leave a comment