తెలుగు చిత్రం ‘బోణి’తో సినీరంగంలో అడుగుపెట్టింది కథానాయిక కృతి కర్బందా. పవర్‌స్టార్ సరసన తీన్‌మార్‌లో నటించిన ఈ భామ.. ‘బ్రూస్‌లీ’లో రామ్‌చరణ్‌కు అక్కగా నటించి మెప్పించింది. తాజాగా చిత్రసీమలో15ఏళ్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న కృతి సోషల్ మీడియా వేదికగా తనకు ప్రేమను పంచిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపింది. ‘ఇన్నేళ్లలో నా సగం జీవితం నటిగానే గడిపాను. నటనపై నాలో నాకే తెలియని ఓ అభిరుచి ఏర్పడింది. ఈ మధ్యలో ఎన్నో మరపురాని అనుభావాల్ని సంపాదించుకున్నా’ అని చెప్పుకొచ్చింది.
కన్నడలో నేను చేసిన ‘గూగ్లీ’ విడుదలైన సమయమది. అందులో నేను డాక్టర్ స్వాతిగా కనిపిస్తా. ఒకరోజు షాపింగ్ కోసం మాల్‌కి వెళ్లాము. అక్కడున్న వాళ్లంతా నన్ను గుర్తుపట్టి ‘డాక్టర్ డాక్టర్’ అని పిలవడం మొదలుపెట్టారు. అస్సలు నమ్మలేకపోయాను. ఊహించలేదు కూడా. ఆనందంతో పొంగిపోయా. అప్పుడు పరిశ్రమలో నాకున్న క్రేజ్ ఏమిటో అర్థమైంది’ అని ఓ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది.
‘ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా కుటుంబం, నా భర్త, స్నేహితులు..అన్నింటికంటే నా ప్రతిభను గుర్తించి, నమ్మకంతో నాకు అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలు, నాపై ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు థాంక్యూ’ అంటూ రాసుకొచ్చింది కృతి. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈమె ‘రిస్కీ రోమియో’తో త్వరలో సందడి చేయనుంది.