శీతాకాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో సీతాఫలాలు ఒకటి. సీతాఫలాలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఈ పండ్లను తింటే చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు. సీతాఫలాల్లో శరీరానికి అవసరమైన చాలా రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి రకరకాల ప్రయోజనాలను అందిస్తాయి. అయితే సీతాఫలంతో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం..
ఆస్తమా ప్రమాదాన్ని తగ్గిస్తుంది
సీతాఫలంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఆస్తమాతో బాధపడేవారు తింటే కొంత ఉపశమనం లభిస్తుంది. శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, శోథ నిరోధక చర్య ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అవి రక్త నాళాలలో ఉంటాయి. దానివల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దాంతోపాటు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పక్షవాతంవంటి వ్యాధులను నివారిస్తుంది.
జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో
ఈ ఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణాశయాన్ని మంట వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి
గుండె సమస్యలు, ఒత్తిడి క్యాన్సర్, అధిక ఆక్సీకరణ వంటివి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. అయితే సీతాఫలంలో ఉండే కౌరినోయిక్ యాసిడ్, విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు ఆ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది
శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడంలో సీతాఫలం సహాయపడుతుంది. సీతాఫలంలో ఉండే విటమిన్ నియాసిన్.. కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు నుండి రక్షించుకోవచ్చు.
రక్తహీనతను నివారిస్తాయి
సీతాఫలాలు రక్తహీనతను నివారిస్తాయి. ఫోలేట్-రిచ్ పుడ్ తీసుకోవడం ఫోలేట్ లోపం, రక్తహీనత ప్రమాదాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది.