శ్రీలీల కెరీర్‌కు మరో షాక్?… అజిత్ సినిమా నుంచి అవుట్.. అసలేం జరిగింది?

Telugu BOX Office

సినీ పరిశ్రమలో ఏ హీరోయిన్ ఎప్పుడు ‘గోల్డెన్ లెగ్’ అవుతుందో, ఎప్పుడు ‘ఐరన్ లెగ్’ ముద్ర వేయించుకుంటుందో ఊహించడం చాలా కష్టం. క్రేజీ బ్యూటీ శ్రీలీల ధమాకా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. చేతి నిండా అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు, అగ్ర హీరోల సరసన అవకాశాలతో టాలీవుడ్ నెక్ట్స్ నంబర్ వన్ హీరోయిన్ ఈమెనే అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అవకాశాలు భారీగా వచ్చినా, వరుస పరాజయాలు శ్రీలీల కెరీర్ స్పీడ్‌కు బ్రేకులు వేశాయి.

 గత తప్పిదాలే శాపమయ్యాయా?

అఖిల్ అక్కినేని హీరోగా దాదాపు దశాబ్దం తర్వాత తాజాగా ‘లెనిన్’‌తో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన భాగ్యశ్రీ బోర్సేకి కూడా ఈ చిత్రం మంచి బ్రేక్ తెచ్చింది. అయితే ఈ మూవీలో ముందుగా శ్రీలీలని తీసుకున్నారు. ఆమెపై కొంత షూటింగ్ కూడా చేయగా ఫస్ట్ గ్లింప్స్‌లోనూ కనిపించింది. అయితే ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం శ్రీలీల తల్లి ఒత్తిడి మేరకు ఈ సినిమాను పక్కన పెట్టేసిందని టాక్ నడిచింది. ఆ నిర్ణయం సరికాదని, ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే టాలీవుడ్‌లో మంచి బ్రేక్ వచ్చేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘లెనిన్’ హిట్టు తర్వాత శ్రీలీలపై భారీగా ట్రోలింగ్ కూడా నడించింది. తెలుగులో గ్యాప్ రావడంతో కోలీవుడ్ వైపు చూపు తిప్పిన ఈ బ్యూటీ, అక్కడ పరాశక్తి చిత్రంలో నటించింది. నటన పరంగా మార్కులు పడినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ రాలేదు.

 తప్పుకుందా? తప్పించారా?

తమిళ స్టార్ హీరో అజిత్, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీలీలకు గోల్డెన్ ఛాన్స్ దక్కిందంటూ గతంలో వార్తలొచ్చాయి. అజిత్ సరసన నటించే ఈ బంపర్ ఆఫర్‌తో శ్రీలీల తమిళంలో స్టార్ స్టేటస్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మెగా ప్రాజెక్ట్ నుండి శ్రీలీల తప్పుకుందనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతటి లక్కీ ఛాన్స్‌ను వదులుకుని శ్రీలీల కెరీర్ పరంగా పెద్ద తప్పు చేసిందంటూ కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.  ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న ఇతర సినిమాల వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె స్వయంగా తప్పుకుందా? లేక ఇటీవల ఆమె సినిమాల ట్రాక్ రికార్డ్‌ను దృష్టిలో ఉంచుకుని చిత్ర యూనిట్ వేరే హీరోయిన్‌ను వెతుక్కుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల ప్లేసులో కయాదు లోహర్‌ని తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ కేవలం డేట్స్ సమస్య వల్లే ప్రాజెక్ట్ మిస్ అయితే పర్లేదు కానీ, మరేదైనా కారణంతో ఈ క్రేజీ ఆఫర్ చేజారితే మాత్రం అది శ్రీలీల తమిళ కెరీర్‌పై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share This Article
Leave a Comment