మనదేశంలో వీధి కుక్కలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. బైకులపై వెళ్లేవారిని వెంబడించడం, మహిళలు, పసిపిల్లలపై తరుచూ దాడులు చేస్తూ వార్తల్లోకెక్కుతుంటాయి. ఇటీవల వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కుక్కలను టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని సుప్రీం ఆదేశాలు జారీచేసింది. మనదేశంలో ఎక్కడ చూసినా వీధికుక్కలు కనిపిస్తుంటాయి. వాటిని చూసినవారు అన్ని దేశాల్లో కంటే మన దేశంలోనే ఎక్కువ కుక్కలు ఉన్నాయనుకుంటారు. అసలు ఇందులో నిజమెంత ఉందో తెలుసుకునేందుకు ఇటీవలే ఓ సర్వే చేశారు. దీన్నిబట్టి కుక్కలు ఏయే దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఆ సర్వేలో తేలింది.

సర్వే ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక కుక్కలు ఉన్న దేశం అమెరికా. ఇక్కడ 7.58 కోట్ల కుక్కలు ఉన్నాయని లెక్క తేలింది. కుక్కల సంరక్షణ కోసం అమెరికాలో కుక్కల పార్క్‌లు, గ్రూమింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ జంతు సంరక్షణ చట్టాలు కూడా పటిష్టంగా అమలు చేస్తుంటారు. అలాగే రెండో స్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఈ దేశంలో వీధి కుక్కలతో కలిపి మొత్తం 3.57 కోట్ల కుక్కలు ఉన్నాయి. ఈ దేశంలో సగం ఇళ్లలో పెంపుడు కుక్కలు కనిపిస్తుంటాయి. ఈ లిస్టులో చైనా నాలుగో స్థానంలో ఉంది. చైనాలో 2.74 కోట్ల కుక్కలు ఉన్నాయట. ఇక ఇండియా విషయానికొస్తే సుమారు 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాలో 1.5 కోట్ల కుక్కలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఈ దేశంలో ప్రభుత్వం, ప్రజలు కుక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారట. అలాగే ఫిలిప్పీన్‌లో 92 లక్షలు, ఫ్రాన్స్‌లో 74 లక్షలు, రొమేనియా దేశాలు 41 లక్షల కుక్కలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
