మగవాళ్లు మాత్రమే చేసుకునే జాతర.. స్త్రీలకు నిషేధం

Telugu BOX Office

ఏ గ్రామంలోనైనా జాతర లుంటే గ్రామస్థులు బంధుమిత్రుల్ని ఆహ్వానిస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి ఆ జాతరలో పాల్గొని సంబరంగా వేడుకలు జరుపుకుంటారు. తమిళనాడులోని మదురై సమీపంలోని తిరుమంగళంలో జరిగే జాతరలో మాత్రం కేవలం మగవారే పాల్గొంటారు. బంధుమిత్రులెవర్నీ ఆహ్వానించకూడదు. ‘కిడావిరుందు’ పేరుతో వేసవిలో లేదంటే పంటలు వేయడానికి ముందు ఆ గ్రామంలో ఉన్న కరుంబారై ముత్తయ్య ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటారు. అందుకోసం నల్లమేకను పెంచి బలిస్తారు.

ఏడాదికోసారి జరిగే ఆ జాతర వేళ తిరుమంగళంలోని పంట పొలాల్లో పెద్ద ఎత్తున మాంసాహారంతో విందుభోజనాలు ఏర్పాటు చేస్తారు. పర్యావరణహితంగా జరిగే ఆ కార్యక్రమానికి హాజరైనవారంతా సహపంక్తి భోజనాల్లో పాల్గొంటారు. వారంతా భోజనాలు చేశాక అరటి ఆకుల్ని అక్కడే వదిలేస్తారు. అవి భూమిలో కలిసిపోయేవరకూ శుభ్రం చేయరు. అప్పటివరకూ గ్రామంలోని ఆడవాళ్లు ఆ వైపు వెళ్లరు. అలా చేయడం వల్ల తిరుమంగళానికి మంచి జరుగుతుందని తరతరాలుగా అక్కడి ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.

Share This Article
Leave a comment