IRCTC: కేవలం 45 పైసలతో ₹10 లక్షల ప్రయాణ బీమా పొందొచ్చు!

TBO
By TBO

రైలు ప్రయాణికుల భద్రత కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) అందిస్తున్న ప్రయాణ బీమా పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. టికెట్ బుకింగ్ సమయంలో కేవలం రూ.0.45 చెల్లించి, ఈ బీమా పొందవచ్చు. రిజర్వేషన్ టికెట్ తీసుకునే అన్ని తరగతుల ప్రయాణికులకు ఈ ఆప్షన్ వర్తించనుంది (పాసింజర్, సబర్బన్ రైళ్లు మినహా).

ఈ బీమా ద్వారా ప్రయాణ సమయంలో జరిగిన అపమృత్యువుకు లేదా శాశ్వత వైకల్యం కలిగిన సందర్భంలో ₹10 లక్షల వరకు పరిహారం అందుతుంది. చాలా ప్రయాణికులు ఈ ఇన్సూరెన్స్‌పై అవగాహన లేకుండా స్కిప్ చేస్తున్నారు. అయితే, టికెట్ బుక్ చేసే సమయంలో “Travel Insurance” ఆప్షన్‌ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. టికెట్ మొత్తంతో పాటు బీమా మొత్తమూ డెబిట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ పాలసీ కాపీ మెయిల్‌కు వస్తుంది.

ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

అపఘాతం లేదా వైకల్యం సంభవించినపుడు IRCTC బీమా క్లెయిమ్ చేసేందుకు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం:

  • ప్రమాదానికి ముందు & తర్వాత ఫొటోలు

  • ఆసుపత్రి అడ్మిషన్ డాక్యుమెంట్స్

  • వైద్యుడి తుది నివేదిక

  • సంతకం, స్టాంప్ ఉన్న మెడికల్ బిల్లులు

  • మరణించిన ప్రయాణికుడికి సంబంధించి రైలు ప్రమాద నివేదిక

  • బ్యాంకు ఖాతా వివరాలు

  • రద్దు చేసిన చెక్కు

ఈ వివరాలు సమర్పించిన తర్వాత విచారణ జరుగుతుంది. అంగీకరించిన తర్వాత నామినీకి పరిహారం అందించబడుతుంది.

ఈ చిన్న మొత్తపు బీమా పథకం, అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద అండగా నిలవనుంది. కనుక టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణ బీమా ఆప్షన్‌ను సెలెక్ట్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది.

Share This Article