తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ విప్లవ దర్శకుడు టి.కృష్ణ వారసుడిగా ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ తర్వాత విలన్ గా మూడు చిత్రాల్లో నటించాడు. అయితే విలన్ గా నటించినా కూడా హీరో రేంజ్ లో టాక్ రావడంతో తర్వాత చిత్రాల్లో హీరోగా నటించాడు. యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గోపిచంద్ కి గత కొంత కాలంగా అన్నీ ఫ్లాప్ చిత్రాలు రావడంతో కెరీర్ డీలా పడిపోయింది. తాజాగా గోపిచంద్ నటించిన ‘పంతం’ సినిమా నిన్న ప్రీమియం షోలు పడ్డాయి.
ఇక ప్రీమియం టాక్ ప్రకారం..విక్రాంత్ (గోపీచంద్) అనే యువకుడు తన గ్యాంగ్ లతో కలిసి ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లలో దొంగతనాలు చేస్తూ వుంటాడు. అయితే వారు హోమ్ మినిస్టర్ నాయక్ (సంపత్) ఇంట్లో ఒక భారీ చోరీకి పాల్పడగా, ఘటనకు కారకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో గోపీచంద్ గ్యాంగ్ లోని కొందరు సభ్యులను నాయక్ పట్టుకుంటాడు. అయితే వారిని విడిపించడానికి విక్రాంత్ ఏం చేశాడు..విక్రాంత్ గురించి తెలుసుకున్న మంత్రి షాక్ అవుతాడు..అసలు విక్రాంత్ ఎవరు..పొలిటీషియన్స్ ఇళ్లలోనే ఎందుకు దొంగతనం చేస్తున్నాడు..అతని లక్ష్యం ఏంటో అనేది చిత్ర సారాంశం.
‘పంతం’ప్రీమియం టాక్ షో!
కథ కథనాన్ని నడిపించే తీరు బాగానే ఉన్నా.. అక్కడక్కడా కొన్ని బోర్ సన్నివేశాలు విసుగు తెప్పించారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి, ఫోటోగ్రఫీ మరియి సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. విక్రాంత్ గా గోపిచంద్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. మెహ్రిన్ అందాలు, నటన కూడా బాగానే ఉంది. కామెడీ, యాక్షన్ అన్ని వేరియేషన్స్ చక్కగా పండించాడు. కామెడీయన్ పృథ్వి, శ్రీనివాస రెడ్డి, గోపీచంద్ మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. జయప్రకాష్ రెడ్డి కూడా తన పార్థలో నవ్వులు పూయించారు. ఇతర పాత్రలో నటించిన సంపత్, షాయాజీ షిండే, తనికెళ్ళ భరణిలు తమపాత్రలకు న్యాయం చేశారు. ఇకపోతే నిర్మాత కేకె రాధా మోహన్ చిత్రాన్ని బాగా లావిష్ గా నిర్మించారు.
ఈ పంతం చిత్రం హీరో గోపీచంద్ నటన, మంచి యాక్షన్ సన్నివేశాలు, అలరించే కామెడీ, సినిమాలోని పాయింట్, చివర్లో వచ్చే కోర్ట్ సన్నివేశాలు కాస్త పరవాలేదు అనిపించాయి. మొత్తానికి పంతం ఓ మెసేజ్ ఓరియెంటెడ్ అని చెప్పొచ్చు. గ్యులర్ ఫార్మటు లో మంచి మెసేజి తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా ఈ రోజు థియేటర్లలో ఎలా సందడి చేయబోతుంది..రిజల్ట్ ఏలా ఉండబోతుందీ అని రేపటి కలెక్షన్లు బట్టి తెలియాల్సిందే.