టీడీపీ – జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల

Telugu BOX Office

 

టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యింది. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శనివారం విడుదల చేశారు. 118లో టీడీపీ 94, జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. జనసేనకు 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. టీడీపీ-జనసేన పార్టీల్లోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్‌లోనే ఖరారు అయ్యాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండే బరిలోకి దిగనుండగా.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండే మరోసారి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగరి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు టెక్కలి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి బరిలోకి దిగనున్నారు. బీజేపీతో పొత్తు, సీట్లు సర్ధుబాటు కొలిక్కి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం.

 

టీడీపీ అభ్యర్థులు

ఆముదాలవసల – కూన రవికుమార్
ఇచ్చాపురం – బెందాళం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
రాజాం – కొండ్రు మురళీమోహన్
అరకు – దొన్ను దొర
కురుపాం – జగదీశ్వరి
పార్వతీపురం – విజయ్ బొనెల
సాలూరు – గుమ్మడి సంధ్యారాణి
బొబ్బిలి – బేబీ నాయన
గజపతి నగరం – కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం – పూసపాటి అదితి
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
పాయకరావుపేట – వంగలపూడి అనిత
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణబాబు
ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
పి గన్నవరం – మహాసేన రాజేష్
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వరరావు
రాజమండ్రి – ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చినరాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ఆచంట – పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఉండి – మంతెన రామరాజు
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
చింతలపూడి – సొంగా రోషన్ కుమార్
తిరువూరు – కొలికపూడి శ్రీనివాసరావు
నూజివీడు – కొలుసు పార్థసారథి
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
పెడన – కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
పామర్రు – కుమార్ రాజా
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్
జగ్గయ్య పేట – శ్రీరామ్ తాతయ్య
నూజివీడు – కొలుసు పార్థసారథి
నందిగామ – తంగిరాల సౌమ్య
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ కుమార్
బాపట్ల – నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు – బూర్ల రామాంజనేయులు
చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
పర్చూరు – ఏలూరి సాంబశివరావు
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
వేమూరు – నక్కా ఆనందబాబు
కనిగిరి – ముక్కు ఉగ్రనరసింహరెడ్డి
కొండెపి – డోలా బాలవీరాంజనేయులు
ఒంగోలు – దామచర్ల జనార్థన్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

జనసేన అభ్యర్థులు

నెల్లిమర్ల- మాధవి
అనకాపల్లి- కొణతాల
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
తెనాలి-నాదెండ్ల మనోహర్

Share This Article
Leave a comment