అదిరిపోయే కాన్సెప్ట్‌తో ‘షో టైమ్ – సినిమా తీద్దాం రండి’

Telugu BOX Office

ఎంటర్‌టైన్ రంగంమంటేనే క్రియేటివీకి అడ్డా. ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు, ఆదాయానికి కొత్త మార్గాలు వేసుకునేందుకు నిరంతరం తమ బుర్రకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత అనిల్ సుంకర,  ATV ఒరిజినల్స్‌తో కలిపి ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ… చాలామంది సినిమా తీయాలన్న సంకల్పంతో తమ దగ్గరున్న డబ్బులన్నీ పెట్టి సినిమా నిర్మిస్తారు. కానీ దాన్ని రిలీజ్ చేయడానికి అనేక కష్టాలు పడతారు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చూశాను. ఈ రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగింది. ప్రొడక్షన్లో చాలావరకు అనవసరమైన ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సవాళ్లు ఎన్నో సినిమా తీసే నిర్మాతకు ఎదురవుతున్నాయని వాటన్నింటినీ ఈ రియాల్టీ షో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రియాల్టీ షోలా మాదిరిగానే ఇది కూడా ఎలాంటి స్క్రిప్ట్ లేని రియాల్టీ షో. ఓ ప్రముఖ ఓటీటీలో ఇంటర్నేషనల్ వైడ్ గా స్ట్రీమింగ్  చేయబోతున్నాం.  ఈ షో కు మొత్తం 16 స్క్రిప్ట్లను ఎంపిక చేసుకొని అందులో 4 బెస్ట్ స్క్రిట్లను 12 మంది జడ్జీలు ఫైనల్ చేస్తారు. ఆ ఫైనల్ అయిన స్క్రిప్ట్లకు అన్ని విభాగాల్లో పనిచేసే నిపుణులను ఆర్టిస్టులను షోలోనే ఎన్నుకుంటారు. ఇక ఆ స్క్రిప్ట్స్ నేరుగా ఆసక్తి ఉన్న నిర్మాతలు బెడ్డింగ్ చేసి అతితక్కువ బడ్జెట్‌లో  సినిమా పాటలతో సహా షూటింగ్ జరిపేలా ఒక అద్భుతమైన ప్రణాళికను రెడీ చేయబోతున్నాం. ఈ రియాల్టీ షో కి సంబంధించి ఆ తర్వాత షో గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’ అని చెప్పారు.

సినీ రంగంలోకి రావాలనుకునే నటీనటులు, రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు, లిరిసిస్ట్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎడిటర్స్, పబ్లిసిటీ డిజైనర్స్, .. ఇలా సినిమాకి సంబంధించి అన్ని విభాగాల్లోని వారికి తమ టాలెంట్ చూపించే అవకాశాన్ని ‘షో టైమ్’ (Show Time) సినిమా తీద్దాం రండి’ రియాలిటీ షో కల్పించబోతోంది. స్క్రిప్ట్ నుంచి స్క్రీన్ వరకు సినిమా మేకింగ్ ను ఎంతో ఎక్సైటింగ్గా ఈ షో ద్వారా చూపించబోతున్నారు. ‘నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్’ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ షో క్రియేటివిటీ, కాంపిటీషన్‌తో కూడిన ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ కలిసి స్టోరీ టెల్లింగ్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ నేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్‌ని ‘contact@ak.movie‘ కి పంపొచ్చు.

Share This Article
Leave a Comment