సందడిగా సైమా అవార్డ్స్ వేడుక.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్

Telugu BOX Office

దుబాయ్‌ వేదికగా ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (South Indian International Movie Awards 2025) వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు అవార్డ్స్‌ సొంతం చేసుకున్నారు.  2024 సంవత్సరంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, చిత్ర బృందాలకు అవార్డులు ప్రదానం చేశారు. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్‌ను మరో లోకంలోకి తీసుకెళ్లిన ‘కల్కి 2898 ఏడీ’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక ఈ 13వ ‘సైమా’ వేడుకల్లో  తెలుగులో అత్యధికంగా ‘పుష్ప2’ (Pushpa2) ఏకంగా నాలుగు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌ అవార్డును గెలుచుకోగా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్‌ నిలిచారు.

‘సైమా’ 2025 అవార్డ్ విన్నర్స్ (తెలుగు)

ఉత్తమ చిత్రం – కల్కి
ఉత్తమ దర్శకుడు – సుకుమార్
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా
ఉత్తమ నటి – రష్మిక మందన్నా
ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి
ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్
ఉత్తమ సహాయ నటి – అన్నే బెన్
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ)
ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి
ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి
ఉత్తమ గాయని – శిల్పా రావు
ఉత్తమ ప్రతినాయకుడు – కమల్ హాసన్
ఉత్తమ పరిచయ నటి – పంకూరి, భాగ్యశ్రీ బోర్స్
ఉత్తమ పరిచయ నటుడు – సందీప్ సరోజ్
ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని
ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు
ఉత్తమ హాస్యనటుడు – సత్య

Share This Article
Leave a Comment