పాత్ర డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తా – విక్రమ్ స్టన్నింగ్ ఆన్సర్

Telugu BOX Office


సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాలో కాన్‌స్టంట్‌గా ప్రయోగాలు చేసే హీరోలు లిస్ట్ రాస్తే అందులో విక్రమ్‌ పేరు టాప్‌ ప్లేస్‌లో ఉంటుంది. అందరూ ప్రయోగాలు చేసినా.. విక్రమ్‌ చేసే ప్రయోగాలు మరింత ప్రయోగాత్మకంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఎవరూ ఎంచుకోని కథ, తక్కువ మంది చేసే పాత్రలు ఆయన్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న చిత్రం ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిమా జనవరి 26న వస్తోంది. అయితే అప్పుడే ప్రచారం షురూ చేసేశారు.

‘తంగలాన్‌’ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఇటలీవల విడుదల చేసింది. ఈ క్రమంలో విక్రమ్‌ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఇప్పుడు అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతగా ఏం చెప్పాడు అనుకుంటున్నారా? అన్నీ సినిమా గురించి, తన కెరీర్‌ గురించే. అయితే సినిమా టీజర్‌ ఆసక్తికరంగా ఉండటంతో… దాని గురించి ఏం చెప్పినా ఇంట్రెస్టింగ్‌గా మారిపోతున్నాయి మరి. రిపబ్లిక్‌ డే రోజున సినిమాని విడుదల చేస్తున్నారు. సినిమాలో ఆ నేపథ్యం ఉంటుందా అని అడిగితే… అస్సలు లేదు, మిగిలిన సినిమాలతో పోటీ ఉండకుండా జనవరి 26కి వచ్చేశాం అని చెప్పాడు విక్రమ్.


రోజురోజుకీ ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తున్నారు. ఏంటీ కుర్ర హీరోలతో, మీ అబ్బాయితో పోటీ పడతారా అని అంటే… అలాంటిదేం లేదు. పాత్ర డిమాండ్‌ మేరకు బరువు తగ్గా అంటూ తన పాత డైలాగ్‌నే చెప్పేశాడు. అన్నట్లు తంగలాన్‌ అంటే ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారు అని ప్రశ్నిస్తే… తంగలాన్‌ అనేది ఈ సినిమా కథ జరిగే ప్రాంతంలోని ఓ తెగ పేరని, అందుకే ఆ పేరు పెట్టామని చెప్పాడు.

విక్రమ్‌ గతంలో ఓ స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేశారు. మళ్లీ ఇన్నాళ్లుగా చేయలేదు. దీంతో తెలుగు దర్శకులతో మళ్లీ సినిమాలు చేస్తారా? ఎవరి దర్శకత్వంలో నటించాలని ఉంది అని అడిగితే… తెలుగు దర్శకులందరూ ఇష్టమే అని, అయితే ముందుగా రాజమౌళితో సినిమా చేయాలని ఉంది అని చెప్పారు. అంతేకాదు మంచి కథ దొరికితే ఏ డైరెక్టర్‌ చెప్పినా సినిమా చేస్తా అని క్లారిటీ ఇచ్చారు.

Share This Article
Leave a comment