బిగ్‌బాస్‌కి వెళ్తే నా భార్య విడాకులు ఇచ్చేస్తానంది – రవి శివతేజ

Telugu Box Office

నువ్వేకావాలి, స్వయంవరం, మల్లీశ్వరి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చావ్… ఈ సినిమాల పేర్లు చెబితే గుర్తుచ్చే పేరు డైరెక్టర్ విజయభాస్కర్. టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన అల్లుడే రవి శివతేజ. తెలుగులో అనే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన ఆయన కొన్ని సినిమాల్లోనూ మెరిశాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహ ‘ఉస్తాద్‌’ సినిమాలో రవి శివతేజ నటించాడు. అందులో హీరోకు బెస్ట్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు.

 

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉస్తాద్‌ సినిమాతో పాటు తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఉస్తాద్‌ కథ బాగున్నా జైలర్‌, భోళా శంకర్‌ లాంటి పెద్ద సినిమాలతో విడుదల కావడం వల్ల తమకు అంత స్పేస్‌ దొరకలేదని చెప్పాడు. అంతేకాకుండా బిగ్ బాస్ గురించి కూడా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగులో అనేక షార్ట్ ఫిలిమ్స్‌లో నటించిన రవి శివతేజ… విజయ భాస్కర్ కూతురు శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడేవాడినని గుర్తుచేసుకున్నాడు. కష్ట సమయంలో ఉన్నప్పుడు తనకు శ్యామల తోడుగా నిలిచిందని చెప్పుకొచ్చాడు. తమ మధ్య ప్రేమ మొదలై నాటికి ఆమె విజయ భాస్కర్‌ కూతురని కూడా తనకు తెలియదని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అసలు విషయం తెలిశాక తమ పెళ్లి జరుగుతుందా లేదా అనే భయం పట్టుకుందని… కానీ తమకు పెళ్లి అయిందంటే అందుకు ప్రధాన కారణం శ్యామలనే అని తెలిపాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి కుటుంబ సభ్యులను శ్యామలే ఒప్పించి పెళ్లి జరిగేలా చేసిందన్నాడు. ఆమె తన జీవితంలోకి రావడం ఎంతో అదృష్టమని పేర్కొన్నాడు. గతంలో తనకు బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చిందని.. అయితే ఆ షోకి వెళ్తే విడాకులు ఇచ్చేస్తానని శ్యామల బెదిరించిందని రవి శివతే చెప్పాడు. దీంతో తనకు ఆ షోకి వెళ్లాలన్న ఆలోచనే రాలేదని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Share This Article
Leave a comment