పురుషులు లవంగాలు తింటే ఇన్ని ప్రయోజనాలా..

Telugu BOX Office

లవంగాలు.. మన వంటగది పోపుల పెట్టెలో కచ్చితంగా ఉండాల్సి సుగంధ ద్రవ్యం. లవంగం వంటల్లో రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మనకు జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు.. లవంగాలు నమలమని పెద్దలు చెబుతారు. లవంగం, లవంగం నూనె పళ్లు, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి. వ్యాధుల్ని నియంత్రిచడంలోనూ లవంగాలు ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి. లవంగాల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీకార్సినోజెనిక్‌ లాంటి లక్షణాలు అనేకం ఉన్నాయి.

లవంగం అన్ని వయసుల వారికి మంచిదే అయినప్పటికీ.. మగవారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచడానికి, వారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో లవంగాలు సహయపడతాయి. పురుషులు వారి ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే మరిన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

స్మెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది..

లైఫ్‌స్టైల్‌లో మార్పులు, ధూమపానం, చెడు ఆహారపు అలవాట్లు, మద్యపానం, దీర్ఘకాలిక వ్యాధులు వంటి అనేక సమస్యల కారణంగా.. పురుషులలో సంతానోత్పత్తి సమార్థంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుంది. పురుషుల సంతానోత్పత్తి సమార్థ్యం పెంచడానికి ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. లవంగాల్లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్‌ చేసి రిప్రొడెక్టివ్‌ అవయవాలకు.. నష్టం జరగకుండా చూసుకుంటాయని ఓ అధ్యయనం వ్యక్తం చేసింది. మగవారు లవంగాలు తింటే స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది, స్పెర్మ్‌ నాణ్యత, మూవబిలిటీని మెరుగుపడుతుంది.

లైంగిక వాంఛ..
లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, సపోనిన్‌లు వంటి ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి లైంగిక కోరికను ప్రేరేపించడంలో, లిబిడోను పెంచడంలో సహాయపడతాయి. లైంగిక పనితీరు, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంతో పాటు, అకాల స్ఖలనాన్ని నివారించడానికి లవంగాలు సహాయపడతాయి.ఒక అధ్యయనం ప్రకారం లవంగం నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా.. లైంగిక వాంఛను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

 

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..
చాలా అధ్యయనాలు స్త్రీల కంటే పురుషులకు మధుమేహం వచ్చే అవకాశం రెండింతలు ఉన్నట్లు పేర్కొన్నాయి. లవంగాలలో అధిక యాంటీహైపెర్గ్లైసీమిక్, హెపాటోప్రొటెక్టివ్, హైపోలిపిడెమిక్, యాంటీఆక్సిడేటివ్ లక్షణాలు ఉన్నాయి ఓ అధ్యయనం వెల్లడించింది.ఇది శరీరంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. లవంగాలు కాలేయ కణాలు దెబ్బతినకుండా నిరోధించడంలో చాలా సహాయపడుతుంది.

 

బీపీ నియంత్రణలో ఉంటుంది
అధ్యయనాల ప్రకారం, మహిళల కంటే పురుషులు అధిక రక్తపోటుకు గురవుతారు. లవంగాలలో ఉండే కార్డియోప్రొటెక్టివ్ చర్య కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లవంగాలు తీసుకుంటే గుండె కండరాల ఆరోగ్యంగా ఉంటాయి. పురుషులు లవంగాలు తీసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

 

పళ్లు ఆరోగ్యంగా..

లవంగాలలో యాంటీ జింజివిటిస్, యాంటీప్లేక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దంతాలను ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. లవంగాలు నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడటమే కాకుండా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్, మంట, నొప్పి నుంచి ఉపశమనం అందిస్తాయి. పురుషులలో నోటి దుర్వాసన, పీరియాంటైటిస్‌ను నివారించడానికి లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి.

Share This Article
Leave a comment