భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చొని తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇదే పద్ధతిని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జీవితం ఉరుకుల పరుగులమయం అవుతున్న నేపథ్యంలో చాలామంది తినడానికి కూడా సమయం లేకుండా పనులను చేస్తున్నారు. సమయానికి ఆహారం సరిగా తీసుకోకపోతే శరీరంపై శ్రద్ధ కూడా తగ్గుతోంది. కొందరైతే ఆదరాబాదరాగా నిలబడి తినేస్తుంటారు.
ఇటీవల కాలంలో బఫే పేరుతో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కూడా నిలబడే తింటున్నారు అయితే ఎప్పుడైనా పర్వాలేదు కానీ అదే పనిగా రోజూ నిలబడే ఆహారం తింటుంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. నిలబడి తినడం వల్ల పేగులు కుషించుకుపోయి ఆహారం జీర్ణం కాక జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందట. అంతేకాకుండా జీర్ణాశయంలోకి ఆహారం నేరుగా వెళ్లడం వల్ల కడుపునొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే శరీరంలో కొవ్వు కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఇకపై ఎప్పుడూ కూడా నిలబడి తినడానికి ప్రయత్నం చేయకండి. వీలైనంతగా నేలపైనో… డైనింగ్ టేబుల్‌పైనో కూర్చుని తినడానికే ప్రాధాన్యం ఇవ్వండి.