విజయవాడ రోడ్లు కిక్కిరిపోయాయి. ఎటు చూసినా జనంతో నిండిపోయాయి. రోడ్డు పొడవునా ప్రధాని నామ స్మరణే. మోడీ.. మోడీ అనే నినాదాలే వినిపిస్తున్నాయి. విజయవాడలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. కూటమి అభ్యర్థుల తరపున చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ రోడ్ షో నిర్వహించారు. దీంతో రోడ్ షోకు జనం పోటెత్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు, విజయవాడ జనం భారీగా తరలివచ్చారు.
రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇప్పటికే నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించారు. చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించి కీలక హామీలు ఇచ్చారు. ఇప్పుడు విజయవాడ రోడ్ షోకు అనూహ్య స్పందన వస్తోంది. 1.5 మీటర్ల మేర చేపట్టిన రోడ్ షోకు ప్రజల నుంచి భారీగా మద్దతు వచ్చింది. ఈ రోడ్ షోలో ప్రజలకు ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభివాదం చెబుతూ ముందుకు కదిలారు. ఈ రోడ్డు షోకు 5 వేల మంది పోలీసు బందోబస్తుతో హై సెక్యూరిటీ కల్పించారు.